हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

యువతిపై సామూహిక అత్యాచారం

Sharanya
యువతిపై సామూహిక అత్యాచారం

ఎన్ని కఠిన చట్టాలు అమల్లో ఉన్నా, కొందరి కామాంధుల్లో మార్పు రావడం లేదు. మహిళను చూసి అమాంతం రెచ్చిపోతున్నారు. కామంతో కుక్కిలిపోతూ వావివరసలు మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. ఆధునిక యుగంలో రాత్రివేళ మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకుంటున్నా, పట్టపగలే మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటుండడం సమాజానికి తీవ్ర కలకలం రేపుతోంది. నమ్మినవారే వారి భద్రతకు ముప్పుగా మారుతున్నారు. తాజాగా, గార్డెన్ సిటీ బెంగళూరులో ఓ మహిళపై దారుణ ఘటన చోటుచేసుకుంది. నమ్మినవారే ఆమెను మోసం చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలో మహిళా భద్రతపై మరికొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

gulfnews import 2019 01 25 Rape victim, abuse victim resources1 16a31076647 large

నమ్మినవాడు మోసం గ్యాంగ్ రేప్

కోరమంగళలో గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జామున ఓ మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకరు మహిళతో ముందుగా పరిచయం పెంచుకున్నాడు. తాను పాత స్నేహితుడినంటూ మాటలు కలిపి, గత జ్ఞాపకాలను గుర్తు చేశాడు.
ఆపై ఆ యువతిని నమ్మించుకుని తాను పనిచేసే హోటల్‌కు తీసుకెళ్లాడు. హోటల్ టెరస్‌పై దారుణం
హోటల్‌కి తీసుకెళ్లిన తర్వాత, టెరస్‌పైకి తీసుకెళ్లి అక్కడ ఇంకో ముగ్గురు నిందితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు.

నలుగురూ కలిసి సామూహిక అత్యాచారం

అనంతరం ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. కొద్ది సేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు అరెస్టు మరో నిందితుడు పరారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అజిత్, విశ్వాస్, శివులు అనే ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరిని పశ్చిమ బెంగాల్‌లో, మరొకరిని ఉత్తరాఖండ్‌లో అరెస్టు చేశారు. నాలుగో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. నిందితులంతా బెంగళూరులోని HSR లేఔట్‌లో ఉన్న హోటల్‌లో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి

ఈ ఘటనపై శుక్రవారం ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో సమాచారం అందిందని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. బాధితురాలిని మెడికల్ టెస్టులకు పంపించి అన్ని అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తిచేశామని చెప్పారు. ప్రాథమిక విచారణలో బాధితురాలు ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారని, ఆమె పెళ్లైన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

మహిళల భద్రతపై ప్రశ్నలు

ఈ ఘటన మరోసారి మహిళల రక్షణపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తోంది. పట్టపగలే నమ్మినవారే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే, మహిళల భద్రత ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. మహిళల భద్రతను మెరుగుపరిచేలా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.
నిందితులకు తక్షణమే కఠిన శిక్షలు విధించి, ఇలాంటి ఘోరాలకు చెక్ పెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. మహిళల భద్రతను కాపాడేలా నూతన చట్టాలు తీసుకురావాలి. ప్రతి నగరంలో ప్రత్యేక మహిళా పోలీసు విభాగాన్ని బలోపేతం చేయాలి. సీసీటీవీ వ్యవస్థను మరింత విస్తరించి, నేరస్థులను వెంటనే గుర్తించే చర్యలు తీసుకోవాలి. సమాజంలో మహిళలు భద్రంగా జీవించాలంటే కఠిన చట్టాలతో పాటు సామాజిక బాధ్యత కూడా అవసరం అని నెటిజన్లు అంటున్నారు. రేపిస్టులకు కనీసం పది ఏళ్లు కఠిన శిక్ష తప్పనిసరి చేయాలి మహిళల భద్రత కోసం ప్రత్యేక ఫోర్సులను ఏర్పాటు చేయాలి. నేరస్తులను వెంటనే శిక్షించేలా కఠిన చట్టాలు అమలు చేయాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870