हिन्दी | Epaper

24న రైతుల ఖాతాల్లో నిధులు

Anusha
24న రైతుల ఖాతాల్లో నిధులు

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 24న ప్రధాని మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ కానున్నట్లు అధికారిక సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రం, భాగల్పూర్‌లో ఏర్పాటు చేసే సభలో ఈ నిధులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. 2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతోంది. ఏప్రిల్–జూలై, ఆగస్టు–నవంబర్, డిసెంబర్–మార్చి ఇలా సంవత్సరానికి మూడు విడతలుగా రైతులకు రూ.2,000 చొప్పున విడుదల చేస్తుంటారు.పీఎం కిసాన్ నిధులను పొందేందుకు రైతులు తప్పనిసరిగా తమ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ-కేవైసీ పూర్తిచేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కాని అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అలాగే భూమి ధృవీకరణ కూడా అవసరమని, ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాతో లింక్ చేయించుకోవడం తప్పనిసరని సూచించారు.

12 06 2023 pm kisan 23439402

పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్లు:

రైతులు పీఎం కిసాన్ స్కీమ్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే కస్టమర్ కేర్ నంబర్ 155261 లేదా 1800-11-5526 (టోల్ ఫ్రీ)కు కాల్ చేయవచ్చు. లేదా 011-23381092 నంబర్‌కి సంప్రదించి సమాచారం పొందవచ్చు.

పీఎం కిసాన్ నిధులు చెక్ చేసుకోవడం ఇలా:

https://pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

‘బెనెఫిషరీ స్టేటస్ ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి ‘గెట్ డేటా’ క్లిక్ చేస్తే నిధుల జమ వివరాలు వస్తాయి.

    కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం:

    ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, వారి పెట్టుబడికి సహాయపడటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ఎంతో దోహదపడుతోంది. రైతుల వద్ద నేరుగా డబ్బు ఉండటంతో, అవసరమైన సమయంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే సదుపాయం కలుగుతోంది.

    ముఖ్యమైన తేదీ:

    పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల: ఫిబ్రవరి 24, 2025
    లబ్ధిదారులు: 9.7 కోట్ల మంది రైతులు

    పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 2019, ఫిబ్రవరి 24న ప్రారంభించబడింది.

    ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్) లో ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి, ఏడాదికి మొత్తం రూ. 6,000 పెట్టుబడి సాయంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతోంది.

    ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 24, 2019

    లబ్ధిదారులు: సున్నిత భూస్వామ్య రైతులు

    సాయం: రూ. 6,000/ఏటా (మూడు విడతలుగా రూ. 2,000 చొప్పున)

    ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేసే విధానం.

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

    వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

    విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

    విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

    మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

    మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

    సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

    సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

    సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
    0:26

    సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

    నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
    0:32

    నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

    ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

    ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

    ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

    ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

    భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

    భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

    సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

    సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

    చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

    చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

    గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

    గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

    📢 For Advertisement Booking: 98481 12870