हिन्दी | Epaper
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Ring Road : రూ.1,285 కోట్లుతో ఫ్లైఓవర్ నిర్మాణం.. ప్రారంభానికి ముందే కూలడం

Sudheer
Ring Road : రూ.1,285 కోట్లుతో ఫ్లైఓవర్ నిర్మాణం.. ప్రారంభానికి ముందే కూలడం

రాజస్థాన్‌లోని జోధ్పూర్ నగరంలో నిర్మాణంలో ఉన్న రూ.1,285 కోట్ల రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే వివాదాస్పదంగా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఫ్లైఓవర్ స్లాబ్‌లు పలు చోట్ల కూలిపోవడం స్థానికులను, సోషల్ మీడియాను కుదిపేసింది. ఇంకా ప్రారంభించకముందే ఇంత భారీ ప్రాజెక్ట్‌లో లోపాలు బయటపడటం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపుతోంది. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం అంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించినప్పటికీ, నిర్మాణ నాణ్యతపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, “ఇంత నిర్లక్ష్యంగా నిర్మాణం ఎలా జరుగుతుంది?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. అతిపెద్ద వసతి సముదాయం

ఈ ఘటనపై రహదారి నిర్మాణానికి బాధ్యత వహించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వివరణ ఇచ్చింది. తమ ప్రాథమిక పరిశీలనలో 3-4 ప్రదేశాల్లో ఫ్లైఓవర్ స్లాబ్‌లు దెబ్బతిన్నట్లు గుర్తించామని, ఇప్పటికే మరమ్మతు పనులు పూర్తి చేశామని NHAI స్పష్టం చేసింది. అయితే ఈ వివరణ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. స్థానికులు, పౌర సంఘాలు కాంట్రాక్టర్లు మరియు పర్యవేక్షక అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తూ, సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నిర్మాణ నాణ్యతపై రాజస్థాన్ ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రింగ్ రోడ్ జోధ్పూర్ ట్రాఫిక్ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా రూపొందించబడింది. కానీ ప్రారంభానికి ముందే ఫ్లైఓవర్‌లు కూలిపోవడం, నిధుల వృథా, భద్రతా లోపాలు వంటి అంశాలు వెలుగులోకి రావడం ప్రభుత్వ ప్రతిష్టకు దెబ్బతీస్తోంది. నిపుణులు కూడా ఇలాంటి మల్టీకోటీ ప్రాజెక్టుల్లో నాణ్యత నియంత్రణ కఠినంగా ఉండాలని, సాంకేతిక పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై కేంద్ర రవాణా శాఖ స్థాయిలో విచారణకు అవకాశం ఉందని సమాచారం.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870