జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) లో పాక్ డ్రోన్ల చొరబాట్లు మళ్లీ నమోదవుతుండటంతో విమానయాన రంగం అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించి ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో 6 ప్రధాన నగరాలకు ఇవాళ నడపాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నగరాల్లో జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్, శ్రీనగర్‌లు ఉన్నాయి.
వెళ్లాల్సిన విమానాలే కాకుండా అక్కడి నుంచి బయలుదేరాల్సిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్
ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు పై నగరాలకు వెళ్లాల్సిన విమానాలే కాకుండా అక్కడి నుంచి బయలుదేరాల్సిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేశామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసిన తమ సంస్థ, పరిస్థితులు నియంత్రణలోకి వచ్చేవరకు ఇది తాత్కాలిక చర్యగా ఉంటుందని పేర్కొంది. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు నిరాశకు లోనయ్యారు.
ప్రయాణికులకు ఒక కీలక సూచన
ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ ప్రయాణికులకు ఒక కీలక సూచన చేసింది. ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు తమ తమ ఫ్లైట్ స్టేటస్‌ను సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని కోరింది. భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి రాజీ పడదన్న సంకేతాలతో, డ్రోన్ల ముప్పు దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ చర్య యాత్రికుల జీవితాలకు ప్రాధాన్యం ఇస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Also : Rains : జూన్ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు?