ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు చెందిన 9 మందితో సహా 23 మంది భారతీయ మత్స్యకారులు (Fishermen) బంగ్లాదేశ్ (Bangladesh) జైలు నుంచి విడుదలయ్యారు. వీరు గత కొంతకాలంగా బాగేర్‌హట్ జైలులో ఉంటున్నారు. జైలు అధికారులు ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకు వారిని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు అప్పగించారు.
Read Also: digital sounds : డిజిటల్ శబ్దాల్లో మసకబారుతున్న శతకబోధన
ఈ సమయంలో భారత హైకమిషన్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, పోలీసులు, జిల్లా పరిపాలన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హాజరయ్యారు. కోస్ట్ గార్డు సిబ్బంది విడుదలైన మత్స్యకారులను భారీ భద్రతతో మోంగ్లా సీపోర్ట్ కు తీసుకువెళ్లారు.

గురువారం వారిని బంగ్లాదేశ్-భారత్ సముద్ర సరిహద్దు మధ్యలో ఇండియన్ కోస్ట్ గార్డుకు అప్పగించే అవకాశం ఉంది. అక్టోబర్ 2025లో ఈ మత్స్యకారులు (Fishermen) బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో ఆ దేశ అధికారులు వారిని అరెస్టు చేశారు. రెండు దశల్లో ఈ మత్స్యకారులు అరెస్టయ్యారు. బంగ్లాదేశ్ నావికాదళం మొదటిసారి 14 మందిని, రెండోసారి 9 మంది మత్స్యకారులను అదపులోకి తీసుకుంది. నాటి నుంచి వీరు బాగేర్‌హట్ జైల్లో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: