శ్రేయ లోహియా – భారతదేశం గర్వించే క్రీడా ప్రతిభ
హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాకు చెందిన 17 ఏళ్ల శ్రేయ లోహియా భారత మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం రాసింది. ఆమె భారతదేశంలోనే తొలి మహిళా ఫార్ములా 4 రేసర్గా (Female F4 Racer) నిలిచింది.శ్రేయ సాధించిన విజయాలు యువతకు, ప్రత్యేకంగా అమ్మాయిలకు, ప్రతిరంగంలో రాణించగలరని స్ఫూర్తి ఇస్తున్నాయి. చిన్నప్పటినుండి ఆమె కార్టింగ్ రేసింగ్తో ఆసక్తి చూపుతూ, 9 ఏళ్ల వయసులో కార్టింగ్ కారును నడిపి అనుభవాన్ని సంతరించుకుంది.
Read also: Nara Lokesh: విశాఖ సీఐఐ సదస్సుకు దేశీయా విదేశీయ నేతలకు లోకేశ్ ఆహ్వానం

కుటుంబం అండగా – విజయం సాధించడంలో పాత్ర
శ్రేయ తల్లిదండ్రులు రితేశ్ మరియు వందన లోహియా, ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రతి దశలో ఆమెకు మద్దతు అందించారు. చిన్న వయసులోనే కార్టింగ్‌లోకి తీసుకు వెళ్ళి, ప్రోత్సహించి, అంచెలంచెలుగా శ్రేయను దేశంలోనే ఫార్ములా 4 రేసర్‌గా(Female F4 Racer) నిలిపారు.
ఇప్పటివరకు ఆమె 30కు పైగా పోడియం ఫినిషింగ్‌లు సాధించింది. 2024లో హైదరాబాద్(Hyderabad) బ్లాక్ బర్డ్స్ జట్టుతో భారత ఫార్ములా 4 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, నాలుగుసార్లు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా నుండి సత్కరించబడింది.
రేసింగ్‌తో పాటు, శ్రేయ(Shriya Lohia) 12వ తరగతి సైన్స్ విద్యార్థినిగా చదువులోనూ చురుకుగా ఉంది. కాలేజీకి వెళ్లకపోయినా ఇంట్లో ప్రిపేర్ అవుతూ పరీక్షలు రాస్తోంది.
తన తండ్రి తెలిపారు, శ్రేయ మనాలి హిమాలయన్(Himalayan) ర్యాలీకి సిద్ధమవుతోంది, వచ్చే ఏడాది 18 ఏళ్లు నిండిన తర్వాత అధికారికంగా పాల్గొంటుంది. అలాగే, రాబోయే 2-3 నెలల్లో ఫార్ములా రేసింగ్ కోసం విదేశాలకు వెళ్ళనుంది.
ఫార్ములా 4 అంటే ఏమిటి?
- ఫార్ములా వన్ (F1) అనేది అత్యున్నత మోటార్ స్పోర్ట్స్ వర్గం, కార్లు గంటకు 370 కి.మి వేగంతో నడుస్తాయి.
- ఫార్ములా 4 (F4) 15-17 ఏళ్ల కొత్త డ్రైవర్ల కోసం ప్రారంభ స్థాయి రేసింగ్.
- ఇందులో సాధారణ సాంకేతికత కలిగిన కార్లు ఉంటాయి, గంటకు 220 కి.మి వేగం సాధిస్తాయి.
- F4 రేసర్లు భవిష్యత్తులో F1 డ్రైవర్లుగా మారే అవకాశం కలిగి ఉంటారు.
శ్రేయ లోహియా ఎక్కడి పునాది?
హిమాచల్ ప్రదేశ్, మండీ జిల్లా, సుందర్‌నగర్.
ఆమె వయసు ఎంత?
17 ఏళ్లు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: