టీమ్ఇండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జహీర్ సాగరిక జంట బుధవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. బాబుకు ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు కూడా పెట్టారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు జహీర్ సాగరిక జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జహీర్ ఖాన్
దైవ ఆశీర్వాదం, ప్రేమ, కృతజ్ఞతతో మేము మా చిన్న బాబు ఫతేసిన్హ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము అని ఆమె రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ జంట ఓ అందమైన కుటుంబ ఫొటోను కూడా పంచుకుంది. ఫొటోలో జహీర్ ఖాన్ తన బిడ్డను తన ఒడిలో పట్టుకుని ఉండగా, సాగరిక తన చేతులను జహీర్ భుజాల చుట్టూ ఉంచడం చూడొచ్చు.తొలి బిడ్డకు స్వాగతం పలికిన జహీర్ ఖాన్ దంపతులకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, 2016లో తోటి క్రికెటర్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సింగ్ వివాహం సందర్భంగా సాగరిక ఘట్గే, జహీర్ ఖాన్ తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2017లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు.
కీలక పాత్ర
జహీర్-సాగరిక పెళ్లై దాదాపుగా 8 ఏళ్లు కావొస్తోంది. కొన్నాళ్లు లవ్ చేసుకున్నాక 2017 నవంబర్‌లో వీళ్లిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి ఈ స్టార్ కపుల్ ముంబైలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు మొదటి బిడ్డకు జన్మను ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో జహీర్ దంపతుల మీద శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొడుకును కూడా నీలాగే చాంపియన్ బౌలర్‌ను చెయ్ అంటూ జహీర్‌ను కోరుతున్నారు ఫ్యాన్స్. కాగా, ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు లెజెండరీ స్పీడ్‌స్టర్. లక్నో సూపర్ జెయింట్స్‌గా మెంటార్‌గా ఉన్న జహీర్ యువకులతో నిండిన జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో పండంటి బిడ్డ పుట్టడం అతడి సంతోషాన్ని డబుల్ చేసిందని చెప్పొచ్చు. ఇక, ఈ సీజన్‌లో 7 మ్యాచుల్లో 4 విజయాలతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది లక్నో టీమ్.
జహీర్ ఖాన్ తన క్రికెట్ కెరీర్ లో 2000 నుంచి 2014 వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 92 టెస్టు మ్యాచులు ఆడి 1231 పరుగులు చేయడంతో పాటు 311 వికెట్లు తీశాడు. 200 వన్డే మ్యాచులు ఆడి 792 పరుగులతో పాటు 282 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదరశ 11 సార్లు చేశాడు. టెస్టుల్లో ఓ మ్యాచులో అయితే ఏకంగా 10 వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. అతడి బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 7/87.
Read Also: IPL 2025: కేకేఆర్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్