ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్-హరిద్వార్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న మహీంద్రా XUV కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు ముందు భాగం ట్రక్కు కిందకు దూసుకుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్నేహితులు—ధీరజ్ జైస్వాల్ (31), హరిఓం పాండే (22), కరణ్ ప్రసాద్ (23), సత్యం కుమార్ (20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా రిషికేశ్ నివాసితులుగా పోలీసులు గుర్తించారు.
AP: రైలులో అగ్నిప్రమాదం.. అధికారులతో మాట్లాడిన మంత్రి అనిత
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన ఒక ఆవు. వేగంగా వెళ్తున్న కారు ముందుకి ఆవు రావడంతో, దాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ వాహనాన్ని ఒక్కసారిగా ఎడమ వైపునకు తిప్పాడు. అయితే అతివేగం కారణంగా కారు నియంత్రణ కోల్పోయి, పక్కనే పార్క్ చేసి ఉన్న హర్యానా రిజిస్ట్రేషన్ గల భారీ ట్రక్కును ఢీకొట్టింది. కారు ఎంత వేగంతో ఉందంటే, డెడ్ బాడీలను వాహనం నుండి బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్ గ్యాస్ కట్టర్లను ఉపయోగించి కారు పైభాగాన్ని కట్ చేయాల్సి వచ్చింది.

ఈ ఘోర కలివిడికి కారణమైన అంశాలను గమనిస్తే.. జాతీయ రహదారులపై అతివేగం, ఇష్టానుసారంగా వాహనాలను నిలిపివేయడం మరియు రోడ్లపై తిరుగుతున్న పశువులు ప్రాణాంతకంగా మారుతున్నాయని అర్థమవుతోంది. రాత్రి సమయాల్లో వెలుతురు తక్కువగా ఉండటం, అడొచ్చే జంతువులను చూసి కంగారులో సడన్ బ్రేకులు వేయడం లేదా వాహనాన్ని మళ్లించడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో డెహ్రాడూన్ పోలీసులు రహదారులపై తిరుగుతున్న పశువులకు రేడియం కాలర్లను (Radium collars) ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com