వాహనదారులకు కేంద్రం శుభవార్త! ఇప్పటి వరకూ టోల్ ప్లాజా (Toll Plaza) ల వద్ద చెల్లించే ఛార్జీలతో తరచూ ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. ఫాస్టాగ్ వ్యవస్థలో కొన్ని కీలకపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకపై “యాన్యువల్ పాస్” (Annual Pass) పేరిట సంవత్సరానికి ఒకేసారి ఫీజు చెల్లించి అన్ లిమిటెడ్ హైవే ప్రయాణం చేసే అవకాశం కల్పించనుంది.

కొత్త మార్పులు – వాహనదారులకు ఊరట!
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానంలో రెండు కొత్త పద్ధతులను తీసుకురావాలని యోచిస్తోంది. యాన్నువల్ పాస్ పద్ధతి అంటే సంవత్సరానికి ఒక్కసారి ఫాస్టాగ్ ఫీజు చెల్లిస్తే సంవత్సరం మొత్తం అన్ లిమిటెడ్ హైవే జర్నీ చేయొచ్చు. సంవత్సరం ఫీజు రూ. 3000 గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఫీజు ఒకేసారి చెల్లిస్తే టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి అడ్డంకులు ఉండవు. దేశంలోని ఏ ప్రాంతానికైనా హైవేపై దర్జాగా ప్రయాణించవచ్చు. ఎలాంటి అదనపు డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు. రెండు మీరు వెళ్లే దూరాన్ని బట్టి ఫాస్టాగ్ ఫీజు చెల్లించవచ్చు. ప్రతి 100 కి.మీ రూ. 50 చెల్లించే విధంగా రూల్స్ పెట్టారు.
జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్
కొత్త పాలసీని తీసుకురావడానికి గల కారణం దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఒక్కో మార్పు చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే మే 1, 2025 నుంచి దేశంలో టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పును అమల్లోకి తెచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంతో పారదర్శకమైన టోల్ వసూళ్లు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మార్పులు వాహనదారులకు విశేష ఊరట కలిగించబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హైవేల్లో ప్రయాణం మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మారనుంది. “అన్‌లిమిటెడ్ హైవే జర్నీ” అనే సరికొత్త ఆలోచన నిజంగా అమలవుతుందా? దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.
Read also: Jaishankar: పహల్గామ్ దాడి వెనుక భారీ కుట్ర: జైశంకర్