ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 22వ విడత ఆర్థిక సహాయం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా(Farmers Scheme) ఎదురుచూస్తున్నారు. గతేడాది నవంబర్‌లో తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 21వ విడత నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు తదుపరి విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Read Also: FASTag :జాతీయ రహదారుల టోల్‌ప్లాజాల్లో నగదు నిషేధం అమలు

ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా, నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, 22వ విడత నిధులను ఫిబ్రవరిలో ప్రధాని మోదీ స్వయంగా బటన్ నొక్కి విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులు(Farmers Scheme) ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అర్హత ఉన్న రైతులు ఎప్పుడైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి చివరి తేదీని ప్రభుత్వం నిర్ణయించలేదు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు వివరాలను పరిశీలించిన తర్వాత లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చి, తదుపరి విడతల నుంచి నిధులు జమ చేస్తారు.
పీఎం కిసాన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం
- pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
- ‘New Registration’ ఎంపికపై క్లిక్ చేయాలి
- 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయాలి
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి
- రాష్ట్రాన్ని ఎంచుకుని క్యాప్చా కోడ్ నమోదు చేయాలి
- ‘Get OTP’పై క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి
- వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు నమోదు చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి
- అన్ని వివరాలు సరిచూసుకుని ఫారంను సమర్పించాలి
- రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా దరఖాస్తు స్థితిని చెక్ చేసుకోవచ్చు
ఈ విషయాల్లో జాగ్రత్తలు అవసరం
- ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి
- బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి
- దరఖాస్తులో తప్పు సమాచారం ఇవ్వకూడదు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: