ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఏటీఎం, యూపీఐ(UPI) ద్వారా పీఎఫ్ సొమ్ము తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.
Read Also: Lenovo: భారత్ లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ విడుదల
పీఎఫ్ ఉపసంహరణలో విప్లవాత్మక మార్పు
ఈ అంశంపై తాజాగా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. పీఎఫ్ నిధులు పూర్తిగా ఉద్యోగులవేనని పేర్కొన్న మంత్రి, వాటి ఉపసంహరణలో ఉన్న క్లిష్టమైన ప్రక్రియలను సరళీకృతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎలాంటి కారణాలు చూపకుండానే పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు.

ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్
ఏటీఎం(ATM) ద్వారా పీఎఫ్ ఉపసంహరణకు అవసరమైన సాంకేతిక ప్రక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఈ సదుపాయం 2026 మార్చిలోపు అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం పీఎఫ్ సొమ్ము తీసుకునేందుకు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తోందని గుర్తుచేశారు.
అయితే ఇప్పటికే ఆధార్, యూఏఎన్ వంటి వివరాలు అనుసంధానమై ఉన్న నేపథ్యంలో, పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతాతో లింక్ చేయడం ద్వారా డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం ద్వారా నేరుగా నగదు ఉపసంహరణ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఉద్యోగులకు పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభంగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: