EPF withdrawal via UPI : ఈపీఎఫ్ (EPF) సభ్యులకు త్వరలోనే మరో కీలక సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బులను బ్యాంక్ ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే పీఎఫ్ డబ్బులు పొందడం మరింత వేగంగా, సులభంగా మారనుంది.
కొత్త విధానం ప్రకారం, ఈపీఎఫ్ ఖాతాకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కు యూపీఐ ద్వారా నేరుగా డబ్బు బదిలీ అవుతుంది. సభ్యులు తమ యూపీఐ యాప్‌లో పిన్ ఎంటర్ చేస్తే, కొన్ని సెకన్లలోనే పీఎఫ్ మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు లేదా ఏటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చు.
Read also: Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!
ఈ యూపీఐ ఆధారిత ఉపసంహరణ విధానాన్ని (EPF withdrawal via UPI) అమలు చేయడానికి కార్మిక మంత్రిత్వ శాఖ, ఈపీఎఫ్ఓ కలిసి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం సాంకేతిక అంశాలపై పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే దాదాపు 8 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు లాభం చేకూరనుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ డబ్బులు పొందాలంటే సభ్యులు ఉపసంహరణ క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆటో సెటిల్మెంట్ విధానం ద్వారా మూడు రోజుల్లోనే క్లెయిమ్ పరిష్కారం అవుతోంది. ఇటీవలి కాలంలో ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీనివల్ల వైద్యం, విద్య, వివాహం, ఇల్లు వంటి అవసరాల కోసం త్వరగా డబ్బు పొందే అవకాశం లభిస్తోంది.
కరోనా సమయంలో ప్రారంభమైన ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ఇప్పుడు మరింత సులభతరం చేస్తూ యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసే సౌకర్యాన్ని తీసుకురానున్నారు. అయితే ఈ సదుపాయం పొందాలంటే ఈపీఎఫ్ ఖాతా, బ్యాంక్ ఖాతా, ఆధార్, యూపీఐ వివరాలు సరిగా లింక్ అయి ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: