हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండేకు విమానాశ్రయంలో ఊహించని అనుభవం

Sharanya
Eknath Shinde: ఏక్‌నాథ్ షిండేకు విమానాశ్రయంలో ఊహించని అనుభవం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండేకు (Eknath Shinde) ఇటీవల జలగావ్ విమానాశ్రయంలో ఊహించని, అసౌకర్యకరమైన పరిస్థితి ఎదురైంది. రాష్ట్రపతి స్థాయిలో వీఐపీలుగా వూహించబడే వ్యక్తులకు ఈ తరహా సమస్యలు ఎదురవడం అరుదైన విషయం. కానీ షిండే ప్రైవేట్ విమానాన్ని ఉపయోగించబోతున్న సమయంలో పైలట్, తన విధి సమయం ముగిసిందని, ఆరోగ్యంగా లేనని ప్రకటించి టేకాఫ్‌కు నిరాకరించడం, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇది ఎలా జరిగింది?

జలగావ్ జిల్లా ముక్తాయినగర్ ప్రాంతంలో జరిగిన సంత్ ముక్తాయ్ పాల్ఖీ యాత్రలో పాల్గొనడానికి షిండే హాజరయ్యారు. వాస్తవానికి ఆయన మధ్యాహ్నం 3:45 గంటలకు జలగావ్ చేరుకోవాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల రెండున్నర గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముక్తాయినగర్ వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని మంత్రులు గిరీష్ మహాజన్, గులాబ్‌రావ్ పాటిల్ తదితరులతో కలిసి రాత్రి 9:15 గంటలకు షిండే జలగావ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

అయితే అప్పటికే పైలట్ తన డ్యూటీ సమయం ముగిసిందని చెప్పడంతో టేకాఫ్ ఆలస్యం కావాల్సి వచ్చింది. తనకు అనారోగ్యంగా ఉందని విమానం నడిపేందుకు పైలట్ నిరాకరించారు. తిరిగి అనుమతులు తీసుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు.

దీంతో మంత్రులు గిరీశ్ మహాజన్, గులాబ్‌రావ్ పాటిల్ సుమారు 45 నిమిషాల పాటు పైలట్‌తో చర్చించి, ఒప్పించారు. గిరీశ్ మహాజన్ సంబంధిత అధికారులతో మాట్లాడి టేకాఫ్‌కు అనుమతులు కూడా ఇప్పించారు.

అనంతరం విమానం ముంబైకి (Mumbai) బయలుదేరింది. “పైలట్‌కు ఆరోగ్య సమస్య, సమయపాలన విషయంలో ఇబ్బంది ఉంది. కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. మేము విమానయాన సంస్థతో మాట్లాడాం, వారు పైలట్‌కు పరిస్థితిని వివరించారు. ఇది చిన్న సమస్యే” అని గిరీశ్ మహాజన్ తెలిపారు.

కిడ్నీ రోగికి మానవతా సహాయం

ఈ ఉదంతంలో మరొక ముఖ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ కిడ్నీ రోగికి మానవతా దృక్పథంతో సహాయం అందించారు. ముంబైలో అత్యవసరంగా కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన శీతల్ పాటిల్ అనే మహిళ, ఆమె భర్త విమానం అందుకోలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి గిరీశ్ మహాజన్, షిండే విమానంలో వారిని ముంబైకి తరలించే ఏర్పాటు చేశారు. ముంబై విమానాశ్రయంలో అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు.

“ఏక్‌నాథ్ షిండే తన కష్టకాలం నాటి రోజులను నేటికీ మర్చిపోలేదు. సామాన్యుడి పట్ల ఆయన చూపిన సున్నితత్వానికి ఇది నిదర్శనం” అని మంత్రి గులాబ్‌రావ్ పాటిల్ అన్నారు.

ఈ ఘటనలో ఎక్‌నాథ్ షిండే వ్యక్తిత్వం రెండు వైపులా వెలుగులోకి వచ్చింది. ఒకవైపు, అధికారిక సదుపాయాల్లోని లోపాలు, సమయపాలన లోపాలపై సంయమనం పాటించడం, పైలట్‌తో సమస్యను సున్నితంగా పరిష్కరించడం; మరోవైపు అత్యవసర వైద్యం కోసం బాధిత కుటుంబానికి సహాయం చేయడం, మానవతా హృదయాన్ని చాటింది.

Read also: Raipur: అమ్మాయిలపై పోకిరీల దాడి రంగంలోకి దిగిన పోలీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870