దేశ రాజధాని ఢిల్లీ, అలాగే ఎన్‌సీఆర్ (NCR) పరిధిలో గురువారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జూలై 10, 2025 ఉదయం 9 గంటల సమయంలో ఈ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. భూమి 10 కిలోమీటర్ల లోతులో కంపించిందని భూకంప పరిశోధనా కేంద్రాలు వెల్లడించాయి.

ఎక్కడెక్కడ భూమి కంపించింది?
ఈ భూకంప ప్రభావం ఢిల్లీ, ఎన్‌సీఆర్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం (Earthquake) సంభవించింది. 2025 జులై గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1 గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూమి కంపించింది. ఘజియాబాద్, నోయిడా (Ghaziabad, Noida) ప్రాంతలలోని ప్రజలు భూకంప ప్రకంపనలను భయాందోళకు గురయ్యారు. 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో వెంటనే జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం ఉందా?
ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే, కొన్ని ప్రాంతాల్లో పాత భవనాలు స్వల్పంగా బలహీనపడ్డాయి. విద్యుత్ సరఫరాలో కొన్ని నిమిషాల పాటు అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు ఉన్నాయి.
ఢిల్లీ-హర్యానా, యూపీలలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనాలు వచ్చాయి .
భారతదేశంలో అత్యధిక భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏది?
భారతదేశ భూకంప డిజైన్ కోడ్‌లో ఇవ్వబడిన భారతదేశ భూకంప జోనింగ్ మ్యాప్ యొక్క తాజా వెర్షన్ ప్రకారం, భారతదేశాన్ని నాలుగు భూకంప మండలాలుగా విభజిస్తుంది. దాని ప్రకారం భారతదేశంలో అత్యంత భూకంప సంభావ్య ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, గుజరాత్ మరియు అస్సాం . భూకంపాలు ఎక్కువగా సంభవించే మూడు రాష్ట్రాలు ఇవి.
ఢిల్లీలో భూకంపాలు వస్తాయా?
ఢిల్లీ జోన్ IV లో ఉంది, ఇది చాలా ఎక్కువ భూకంప తీవ్రతను కలిగి ఉంటుంది, ఇక్కడ సాధారణంగా భూకంపాలు 5-6 తీవ్రతతో సంభవిస్తాయి, కొన్ని తీవ్రతలు 6-7 మరియు అప్పుడప్పుడు 7-8 తీవ్రతతో సంభవిస్తాయి .
Read hindi news: hindi.vaartha.com
Read also: Gold Rates Today: నేడు స్పల్పంగా తగ్గిన బంగారం ధరలు