భారతదేశంపై పాకిస్తాన్ ఉగ్రతత్వ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, గురువారం సాయంత్రం జమ్మూలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ పేలుళ్లతో జమ్మూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఒక్కరోజు క్రితమే పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దళాలు చేసిన సమర్థవంతమైన దాడులకు ఇది ప్రతీకారం కావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ పేలుళ్లకు గల ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అధికారికంగా వెల్లడికాలేదు.
వైరల్ అవుతున్న వీడియోస్
పేలుళ్ల అనంతరం వైరల్ అవుతున్న దృశ్యాలలో పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన రాకెట్లు కనిపిస్తున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. జమ్మూ ఎయిర్ స్ట్రిప్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో డ్రోన్ దాడులు కూడా జరిగినట్లు సమాచారం. దీంతో జమ్మూలో క్షణాల్లోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, పూర్తిగా బ్లాక్‌అవుట్ ఏర్పడింది.
జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ రియాక్ట్
ఈ దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బాంబులు, షెల్లింగ్, క్షిపణుల దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. భారత్ తాజా ఉగ్రదాడులకు ఘాటు బదులిచ్చిన తర్వాత కూడా పాక్ ఇంకా రెచ్చిపోతున్నది. ఇలాంటి చర్యలతో శాంతికి భంగం కలగడంతో పాటు, భవిష్యత్‌లో మరింత దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Read Also : India : పాక్ కు చైనా ఇచ్చిన రెండు విమానాలను కూల్చివేసిన భారత్!