దేశ రాజధాని ఢిల్లీ భద్రతను మరింత పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘క్యాపిటల్ డోమ్’ పేరుతో అత్యాధునిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రుదేశాల నుంచి వచ్చే క్షిపణి దాడులు, డ్రోన్ ముప్పులను ముందుగానే అడ్డుకోవడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశ్యం.
Read Also: Draupadi Murmu: రేపు సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్న రాష్ట్రపతి

DRDO స్వదేశీ సాంకేతికతతో గగనతల రక్షణ
ఈ రక్షణ వ్యవస్థలో డీఆర్‌డీవో(DRDO) అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు కీలకంగా పనిచేయనున్నాయి. ముఖ్యంగా QRSAM, VL-SRSAM వంటి ఆధునిక ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లు శత్రు లక్ష్యాలను వేగంగా గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటితో పాటు వినూత్న లేజర్ ఆధారిత ఆయుధాలను కూడా ఈ కవచంలో భాగంగా ఉపయోగించనున్నారు.
లేజర్ ఆయుధాలు డ్రోన్లను(DRDO) క్షణాల్లో నిర్వీర్యం చేసే శక్తి కలిగి ఉండటంతో, గగనతలంలో ఎలాంటి చొరబాటుకు అవకాశం ఉండదని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవస్థ అమలులోకి వస్తే, ఢిల్లీపై శత్రువులు దాడి చేయలేని విధంగా బలమైన రక్షణ వలయం ఏర్పడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: