రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) మరో అడ్వెంచర్‌కు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి ఇవాళ సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్నారు. కాగా, ముర్ము.. గోవా, ఝార్ఖండ్, కర్ణాటకలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆమె జలాంతర్గామిలో ప్రయాణం చేయనున్నారు.
Read Also: Bihar: పసిపిల్లల ప్రాణాలు తీసిన చలి మంట

జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము
ఇదిలాఉండగా 2 నెలల క్రితం కూడా రాష్ట్రపతి ముర్ము, రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫైల్‌లో ఆమె గగన విహారం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
2023, మే 8న కూడా ద్రౌపది ముర్ము (Draupadi Murmu) అస్సాంలో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో పయనించారు. తేజ్‌పుర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి విమానంలో విహరించారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు. 2006లో విశాఖపట్నం నుంచి సబ్‌మెరైన్‌లో కలాం ప్రయాణించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: