అమెరికా (America) మరోసారి రెచ్చిపోయింది. భారత వస్తువులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా భారత్ స్పష్టమైన సందేశాన్ని పంపించింది – తమ యుద్ధవిమానాల కొనుగోలుపై మనకు ఆసక్తిలేదని అమెరికాకు చెప్పేసింది. ట్రంప్ ఏ విధంగా సుంకాల దాడికి దిగాడో, భారత్ దానికీ సమాన స్థాయిలో బదులిచ్చింది.బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, భారత్ ఇటీవల అమెరికా అధికారులతో జరిగిన సమావేశంలో “మీ ఐదో తరం ఎఫ్-35 యుద్ధవిమానాలు మాకు అవసరం లేదు” అని తేల్చిచెప్పిందట. అంటే, ఇప్పటికే తాత్కాలికంగా కాదు, పూర్తిగా ఈ ఒప్పందాన్ని భారత్ పక్కనపెట్టినట్టే. ఈ నిర్ణయం ప్రధాని మోదీ ప్రభుత్వ (Modi government) వ్యూహాత్మక ఆలోచనలను స్పష్టం చేస్తోంది.

అమెరికాతో రక్షణ ఒప్పందాలపై యోచనలో భారత్
ఇకపై అమెరికాతో ప్రధాన రక్షణ ఒప్పందాలపై భారత్ ఆమోదం ఇవ్వడం కష్టమేనని సమాచారం. స్వదేశీయంగా ఆయుధ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ భారత్ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిచ్చే కీలక నిర్ణయంగా కనిపిస్తోంది.భారత్ ప్రస్తుత దిశ క్లియర్ – దేశంలోనే ఆయుధాలు తయారు చేయాలి. ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధిగా ఎదగాలన్నదే లక్ష్యం. పెద్ద ఎత్తున భాగస్వామ్యాలతో స్థానికంగా తయారీ కేంద్రాల ఏర్పాటు మీద దృష్టి పెట్టడం జరుగుతోంది. ఇది ఆర్థికంగా మాత్రమే కాదు, జాతీయ భద్రత దృష్ట్యా కూడా ఎంతో కీలకం.
ట్రంప్ ఒప్పుకున్న ఎఫ్-35 డీల్ ఎందుకు ఆగింది?
ఇంతకీ ఎఫ్-35 విమానాల ఒప్పందం ఎందుకు ఆగిపోయింది? ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో, ఈ విమానాల అమ్మకానికి అమెరికా అంగీకరించింది. ట్రంప్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే పలు అంశాలు, ముఖ్యంగా సుంకాలపై తీసుకున్న ట్రంప్ విధానం, భారత్ వైఖరిని మార్చేలా చేసింది.గతంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఎఫ్-35పై విమర్శలు చేశారు. వాటిని ఉదహరిస్తూ అప్పట్లో విపక్ష కాంగ్రెస్ మోదీ సర్కార్‌పై మండిపడింది. ఎఫ్-35లు పాతవైపు వెళ్లిన టెక్నాలజీగా అభివర్ణించబడిన సందర్భాలున్నాయి. భారత్ ఇప్పుడు అదే వైఖరిని మెచ్చినట్టుగా కనిపిస్తోంది.
ఇతర ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్న భారత్
ఈ విమానాలపై ఆసక్తి లేకపోయినా, భారత్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని తప్పనిసరిగా చూస్తోంది. స్వదేశీయంగా తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగించే యోచనలో ఉంది. దీన్ని బట్టి చూస్తే, భారత్ రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అడుగులు వేస్తున్నదని స్పష్టంగా చెప్పవచ్చు.
Read Also : Friendship Day : స్నేహితుడి కోసం ఒక రోజు.. ఫ్రెండ్ షిప్ డే