DGCA : విమాన ప్రయాణాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి Directorate General of Civil Aviation (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లో పవర్ బ్యాంక్‌లను ఉపయోగించి మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. అలాగే విమానంలోని సీటు పవర్ అవుట్‌లెట్ల ద్వారా పవర్ బ్యాంక్‌లను ఛార్జ్ చేయకూడదని కూడా స్పష్టం చేసింది.
లిథియం బ్యాటరీల వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో అగ్నిప్రమాదాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. లిథియం బ్యాటరీలతో ఉన్న పవర్ బ్యాంకులు వేడెక్కి మంటలు చెలరేగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ‘డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ సర్క్యులర్’లో పేర్కొంది.
డీజీసీఏ ఆదేశాల ప్రకారం, పవర్ బ్యాంక్‌లు మరియు (DGCA) స్పేర్ లిథియం బ్యాటరీలను కేవలం హ్యాండ్ బ్యాగేజీలో మాత్రమే తీసుకెళ్లాలి. వాటిని ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్‌లలో లేదా చెక్-ఇన్ లగేజీలో పెట్టకూడదు. అక్కడ మంటలు చెలరేగితే గుర్తించడం, అదుపు చేయడం చాలా కష్టమని అధికారులు హెచ్చరించారు.
Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?
లిథియం బ్యాటరీలతో మంటలు చెలరేగితే అవి చాలా వేగంగా వ్యాపిస్తాయని, కొన్నిసార్లు స్వయంగా ఆగకుండా కొనసాగుతాయని డీజీసీఏ తెలిపింది. నాణ్యత లేని బ్యాటరీలు, పాతవి, దెబ్బతిన్నవి లేదా ఓవర్‌ఛార్జింగ్ వల్ల పేలుడు ప్రమాదం కూడా ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ భద్రతా విధానాలను పునఃసమీక్షించుకోవాలని, క్యాబిన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. ప్రయాణికులు ఏదైనా పరికరం నుంచి పొగ, అధిక వేడి లేదా అసాధారణ వాసన గమనిస్తే వెంటనే క్యాబిన్ సిబ్బందికి తెలియజేయాలని సూచించాలని తెలిపింది.
గతంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ఇండిగో విమానంలో, అలాగే దక్షిణ కొరియాలో ఎయిర్ బూసాన్ విమానంలో పవర్ బ్యాంక్‌ల వల్ల మంటలు చెలరేగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కఠిన నిబంధనలు తీసుకువచ్చినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. ఇప్పటికే ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇలాంటి నియమాలను అమలు చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: