గిగ్ వర్కర్లు (Gig Workers) దేశవ్యాప్తంగా, బుధవారం సమ్మెకు పిలుపునిచ్చారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థల డెలివరీ ఏజెంట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. చిన్న కారణాలకే ఐడీలను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ ‘లాగిన్’ అవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో DEC 31న డెలివరీ సర్వీసులు నిలిచిపోనున్నాయి.
Read Also: India economy : భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్
గిగ్ వర్కర్ల డిమాండ్లు ఏంటి?
కేంద్ర ప్రభుత్వం ముందు గిగ్ వర్కర్లు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు. ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ కంపెనీలను కూడా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి. ప్రమాదకరమైన 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను పూర్తిగా నిషేధించాలి. మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, పారదర్శకమైన పెనాల్టీ వ్యవస్థ ఉండాలి.

హోటళ్లు, కస్టమర్ల పరిస్థితి ఏంటి?
న్యూ ఇయర్ వేడుకల కోసం లక్షలాది మంది ఆన్‌లైన్ ఆర్డర్లపై ఆధారపడతారు. సమ్మె ప్రభావం ఉంటే హోటల్ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న రెస్టారెంట్లు తమ సొంత సిబ్బందితో డెలివరీలు చేయాలని భావిస్తుండగా.. పెద్ద వాటికి మాత్రం ఇది పెను సవాలుగా మారింది. మరోవైపు.. కంపెనీలు తమను బ్లాక్ లిస్ట్ చేస్తాయనే భయంతో కొంతమంది ఏజెంట్లు సమ్మెలో పాల్గొనే విషయంలో సందిగ్ధంలో పడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: