ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి దారుణం జరగడం దేశ ప్రజలందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘనంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని దుఃఖంలో ముంచేసిందని పేర్కొంటూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ తరహా ఘటనలు తిరిగి జరగకూడదని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నారు.
Delhi Bomb Blast : హైదరాబాద్ లో విస్తృత తనిఖీలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశంలో పేలుడు జరగడం దేశ భద్రతకు పెద్ద సవాల్ అని ఆయన వ్యాఖ్యానించారు. నిరపరాధుల ప్రాణాలు బలైపోవడం బాధాకరమని ట్వీట్‌లో పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం నిందితులను పట్టుకుని, దాడి వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొన్నారు. నిరపరాధులపై జరిగే ఇలాంటి దాడులు మానవత్వానికి మచ్చ అని వ్యాఖ్యానించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని కోరారు. దేశ ప్రజలంతా ఈ సమయంలో బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/