ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. ప్రారంభ దశలో అధికారులు ఈ ఘటనకు కారణం వాహనంలో ఉన్న CNG సిలిండర్ పేలుడు అయి ఉంటుందని భావించారు. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణులు ఆ అంచనాను కొట్టిపారేశారు. “సాధారణంగా CNG పేలుడు చోటుచేసుకున్నప్పుడు మంటల తీవ్రత తక్కువగా ఉంటుంది, కానీ ఈ ఘటనలో భారీ శబ్దం, అగ్నిజ్వాలలు, వాహనాలు చెల్లాచెదురుగా ఎగిరిపోవడం చూస్తే ఇది సాధారణ ప్రమాదం కాదని తేల్చవచ్చు” అని అధికారులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి సమీపంలోని కార్లు, భవనాలు కూడా దెబ్బతిన్నాయి, ఇది అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం వాడినట్లు సూచిస్తోంది.
Breaking News – Delhi Bomb Blast : ఇది సాధారణ పేలుడు కాదు – ఢిల్లీ సీపీ
దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాల ప్రకారం, అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థంగా ఉపయోగించి ఉండొచ్చని సమాచారం బయటకు వచ్చింది. ఇది గతంలో కూడా అనేక ఉగ్రవాద దాడుల్లో ఉపయోగించబడిన రసాయనమని నిపుణులు చెబుతున్నారు. FSL మరియు NIA బృందాలు సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపించగా, తుది నివేదిక రాకముందే ఇది యాదృచ్ఛిక ప్రమాదం కాదనే సంకేతాలు వెలువడుతున్నాయి. పేలుడు చోటు చేసుకున్న ప్రదేశంలో వాహన భాగాలు, ఇంధన అవశేషాలు మాత్రమే కాకుండా రసాయన పదార్థాల ఆనవాళ్లు కూడా కనిపించాయి.

అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత వహిస్తామని ప్రకటించలేదు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో భద్రతా హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో ఈ ఘటనకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్, NIA, NSG బృందాలు సంయుక్తంగా పరిశోధన చేస్తున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారించని సమాచారం సోషల్ మీడియాలో పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/