ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోయాయి.. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసం చేస్తున్నారు. కొంతకాలంగా బ్యాంకుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. (Cyber Scam) తాజాగా బ్యాంక్ రివార్డ్ పాయింట్ల పేరుతో జనాల్ని ముంచేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో కొంతమందిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. రూ.9999 రివార్డు పాయింట్లు గడువు ముగుస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని క్లెయిమ్ చేసుకోమని మెసేజ్‌లు పంపుతున్నారు.
ఈ మెసేజ్‌తో పాటుగా ‘బీవోఐ మొబైల్.ఏపీకే’ అనే వైరస్ ఫైల్‌ను కూడా పంపిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఈ ఫైల్‌ను క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లు ఖాళీ అవుతాయి. ఈ మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఇది బ్యాంక్ నుంచి వచ్చిన నిజమైన సందేశం అనుకుని, అందులోని లింక్‌ను క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మొత్తం పోతుందని హెచ్చరిస్తున్నారు.
Read Also: Nila river: మూడు శతాబ్దాల తర్వాత కేరళలో తొలిసారి కుంభమేళా
ఏపీకే ఫైళ్లతో సైబర్ మోసాలు
గతంలో కూడా ఇలాంటి మోసాలు జరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో కూడా ఇలాంటి ఏపీకే వైరస్ ఫైల్స్ పంపి సైబర్ నేరగాళ్లు(Cyber Scam) చాలా మందిని మోసం చేశారు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో మళ్లీ ఈ మోసాలు మొదలయ్యాయి. కాబట్టి, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఏదైనా సందేహం ఉంటే నేరుగా బ్యాంకును సంప్రదించడం మంచిది అంటున్నారు. సైబర్ నేరగాళ్లు రివార్డు పాయింట్ల పేరుతో వాట్సాప్‌లో ఏపీకే (APK) ఫైళ్లను పంపి మోసాలకు పాల్పడుతున్నారు. (Cyber Scam) ఏపీకే ఫైల్‌ను పొరపాటున క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుంది. వారి ఫోన్ నంబర్ పేరు ‘బీఓఐ’గా మారిపోతుంది. ఆ నంబర్‌కు సేవ్ చేసిన కాంటాక్ట్స్‌కు ఆటోమేటిక్‌గా ఈ ఏపీకే ఫైల్, ఒక సందేశం వెళ్లిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: