దేశవ్యాప్తంగా ఉన్న 48 సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ యూజీ 2026 (CUET UG 2026) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 31, 2026 రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన లేదా చదువుతున్నవారు అర్హులు. పరీక్ష మే 11 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
Read also: Andhra Pradesh: ఈ నెలలో స్కూళ్లకు 14 రోజులు సెలవులు?
పూర్తి వివరాలు
దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు మూడు సబ్జెక్టుల వరకు రూ.1000, అడిషనల్ సబ్జెక్టుకు రూ.400, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు మూడు సబ్జెక్టులకు రూ.900, అడిషనల్ సబ్జెక్టుకు రూ.375 చొప్పున తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ అభ్యర్ధులు మూడు సబ్జెక్టులకు రూ.800, అడిషనల్ సబ్జెక్టుకు రూ.350 చొప్పున చెల్లించాలి.

హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా.. ఈ 13 భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు. సీయూఈటీ యూజీ 2026 ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా వర్సిటీలు, ఇతర కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. ఇక రాత పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో మే 11 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: