యూపిలోని బరేలీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి అలసిపోయి తన ఇంటికి సమీపంలోని ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు.అలాగే, అతడు అక్కడే నిద్రలోకి జారుకున్నాడు. సునిల్ కుమార్(Sunil Kumar) గాఢ నిద్రలో ఉండగా, అక్కడికి వచ్చిన మున్సిపల్ చెత్త వాహన సిబ్బంది ఆయనను గమనించకుండా డ్రైనేజీ సహా చెత్తను ఆయనపైనే కుమ్మరించారు. దాంతో సునిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.అనంతరం సునిల్ కుమార్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని బయటకు తీసి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తు అతడు అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, సునిల్ కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బారాదరి పోలీసులు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

డిమాండ్
కాగా, జరిగిన సంఘటనపై స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Read Also : Jharkhand Encounter: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్ JJMP అధినేత హతం