భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కోవిడ్ మహమ్మారి ముగిసిందన్న భావనలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, కరోనా కొత్త వేరియంట్లతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇటీవల ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం (INSACOG) వెల్లడించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

కొత్త వేరియంట్లు – NB.1.8.1 మరియు LF.7
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను ఇటీవల భారత్‌లో కనుగొన్నారు. ఈ రెండు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) “Variants Under Monitoring (VUM)”గా గుర్తించి ప్రత్యేక పరిశీలన చేస్తోంది. ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ వేరియంట్ల వ్యాప్తి గణనీయంగా పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
NB.1.8.1 కొవిడ్ వైరస్ కేసు ఒకటి ఏప్రిల్‌లో తమిళనాడులో నమోదయింది. మే నెలలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఈ రెండు సబ్ వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్‌గా వర్గీకరించింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కొవిడ్-19 కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లు కారణమని పేర్కొంటున్నారు.
రాష్ట్రాల వారీగా కరోనా
దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 యాక్టివ్ కేసులు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో కొవిడ్ సంబంధిత మరణం నమోదయింది. కొవిడ్‌తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలో శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. రాష్ట్రంలో నాల్గవ కొవిడ్-19 మరణం నమోదయింది. డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో 21 సంవత్సరాల వ్యక్తి థానేలో మరణించాడు.
వేరియంట్ల లక్షణాలు (Symptoms):
కొత్త వేరియంట్ల లక్షణాలు కొన్ని మునుపటి వేరియంట్లకు పోలికగా ఉన్నప్పటికీ, అలసట, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు, జలుబు, మరియు తక్కువ శ్వాస సామర్థ్యం వంటి లక్షణాలతో కలసి తీవ్రత చూపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read also: Covid: కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి