దేశంలో ‘ఓట్ల చోరీ’ జరుగుతోందన్న సరికొత్త ఆరోపణలతో ‘కాంగ్రెస్’ పార్టీ ఎన్నికల సంఘంతో ఓ చిన్న సైజు యుద్ధమే ప్రకటించింది. బీహార్ ప్రత్యేక ఓటర్ల రివిజన్ కార్యక్రమం మొదలెట్టక ముందు, తర్వాత జరుగుతున్న తతంగాన్ని విపక్షాలు ఏ విధంగా నూ అంగీకరించలేకపోతున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఓట్ల దొంగతనం’ విషయమై తీవ్ర ఆరోపణలకు కొనసాగింపుగా ఇప్పుడు ‘ఓటు చోరీ’ వెబ్సైట్ను ప్రారంభించారు. ఓటర్ల డిజిటల్ (Digital) జాబితాలు బయటపెట్టాలని డిమాండ్ చేసిన నేపథ్యంలోనే ఈ వెబ్సైట్ రూపకల్పన జరిగింది. ‘ఓటు చోరీ’ వ్యవహారాన్ని బట్టబయలు చేయ డం చాలా కీలకమంటూ రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా వీడియోను సమస్త ప్రజానీకానికి అందేలా విడుదల చేశారు.
గత పదేళ్ల ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితాను, వాటికి సంబంధించిన వీడియో రికార్డింగ్లను అందించాలని కోరుతూ ఆగస్టు 8న బెంగుళూరు ఫ్రీడమ్ హాల్లో జరి గిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం బిజెపి కలిసి ఓటు ఆక్రమాలకు(occupy) పాల్పడ్డాయని ఢంకా భజాయించి చెప్పారు. అంతకు ముందే కర్ణాటక రాష్ట్రంలోని మహదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్ లెక్కలనా సరాగా చేసుకొని రాహుల్ ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. తాజాగా కర్ణాటక ఎన్నికల కమి షన్ రాహుల్ గాంధీ ఆరోపణలకు సంబంధించి ఆధా రాలను కోరారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఢిల్లీలో పార్ల మెంటు నుంచి ఇసి కార్యాలయానికి ర్యాలీ ప్రారంభించిం ది.
రాజధాని నగరం విపక్షాల నినాదాలు, వాగ్వాదాలతో దద్దరిల్లింది. ఇండియా కూటమిలోని 25 పార్టీల ఎంపి లూ ఇందులో పాల్గొన్నారు. బిజెపి ఎలక్టోరల్ మోసాలకు పాల్పడి గెలుస్తోందన్న విషయంలో నిజనిర్ధారణ చేసే దిశగా కాంగ్రెస్ ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో డిజిటల్ ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘానికి ఎక్కడికక్కడ విజప్తుల ద్వారా జాబితాలను పరిశీలించే కార్యక్రమాన్ని రూపొందించింది. అన్ని రాష్ట్రాలు ఇదే కార్యాచరణలోకి మళ్లాయి.
ఎన్నికల సంఘంతో భేటీకి అనుమతి ఉంది. కానీ ఎంపీలు ర్యాలీగా వెళ్లేందుకు పోలీసుల సమ్మతి | లేదు. దాంతో రాహుల్ గాంధీతోసహా మల్లిఖార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ ప్రధాన ప్రతిపక్ష ఎంపీలు, విపక్ష భాగస్వామ్య పార్టీల ఎంపీలను అదుపులోకి తీసుకు న్నారు. ‘ఓటు చోరీ’ అంశానికి కాంగ్రెస్ అనుకున్నంత ప్రచారానికి ఎన్నికల సంఘమే అవకాశమిస్తోంది. ఎన్ని కలు దేశం గుండె చప్పుడని, అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఓటు దొంగి లించబడినా అది ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని రాహుల్ స్పష్టంగానే విమర్శిం చారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి నష్టంవాటి ల్లుతోంటే కూటమి ఎంపీలు ఊరుకోబోమని చెప్పారు.
ఎన్నికల కమిషను మందలించిన సుప్రీం కోర్ట్
రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉం దంటూ ప్రజల్ని చైతన్యపరిచే బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకున్నారు. డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు తొక్కి పడుతున్నారు? నకిలీ ఓట్ల నమోదు సాకుతో అసలు సిసలైన ఓటర్ల ఓట్లను ఎందుకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవీ రాహుల్ ప్రశ్నలు. దశాబ్దం కిందట బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిగినప్పుడు మంది బలంతో రిగ్గింగ్, పోలింగ్ బూత్లు ఆక్రమించడం వంటి ఆరోపణలు ఉండేవి. వాటిలో ఏ మాత్రం లోపం జరిగిం దని భావించినా ఎన్నికల అధికా రులు రీపోలింగ్కు ఆదేశించి, ఎన్నికలు సజావుగా జరిపించామని అనిపి స్తుంటారు.
ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టం వచ్చిందో అప్పటి నుంచి ఎన్నికలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని సందేహించడంలో ఎవరూ తక్కువ వారు కాదు. వారెవరికీ మినహాయింపులు లేవు. గెలిచిన వారు ప్రజా స్వామ్యం గెలిచిందని సంబరపడితే, ఓడిన వారు ఇవి ఎంలలో లోపమని ఆరోపణలు చేయడం సర్వసాధార ణమే. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సంద ర్భంలో అన్ని పార్టీల వారూ ఇలాంటి మీమాంసలకు అర్థం తెలుసుకో వాలనుకుంటుంటారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమం (ఎస్ఐ ఆర్) ప్రక్రియపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్ ను సున్నితంగా మందలించింది.

దాదాపు 65 లక్షల ఓటర్లు అక్కడ లేరని వారి కార్డులు తీసేయడాన్ని ఇప్పటికీ విప క్షాలు దుయ్యబడుతున్నాయి. బెంగళూరులో నోరెత్తగానే ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ఆరోపణల్లో నిజాయితీ ఉంటే తాను చేసే వాదనలను ధుృవీకరించే అధికార ప్రక టనపై రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రూల్స్ 20(బి)ప్రకారం ప్రమాణ పత్రాలపై సంతకం చేయాలని రాహుల్ కు సవాల్ విసరారు. ఇలాంటి ఆరోపణలపై ఈసి ఈ విధంగా స్పందించడం ఇదే మొదటిసారి కాకపోవ చ్చు. కాని మహదేవ్ పూర్లో నకిలీ ఓట్ల, నకిలీ చిరునా మాలు, ఒకే చిరునామపై వందలకొద్దీ ఓటర్ల నమోదు వంటి అంశాలపై రాహుల్ గాంధీ పూర్తి ఆధారాలతో ఎన్నికల సంఘానికి వివరాలిచ్చినా సింపుల్గా కాదంటూ చాలా పెద్ద మొత్తంలో దొంగ ఓటర్లను తేల్చి చెప్పారు.
వీటన్నిటినీ తగు ఆధారాలతో చూపెట్టినా ఎన్నికల సంఘం పెద్దగా పట్టించు కోవడం లేదు. ఇంతేగాక ఇసి విచిత్రమైన వాదనలు చేస్తోంది. గల్లంతైన ఓటర్ల జాబితా ప్రచురించాలనే నిబంధన ఏదీ లేదని ఎన్నికల సంఘం వాదిస్తోంది. తమ ఓట్ల తొలగింపు జరిగినా ఓటరుకు ఎలాంటి హక్కు లు ఉండవన్న రీతిలో ఎన్నికల సంఘం అడ్డగోలుగా వాదిస్తోంది. ఏది సహేతుకమో, ఏది అహేతుకమో తేల్చా ల్సింది సుప్రీంకోర్టులోనే. ఆందోళనలు ఓ హెచ్చరిక మాత్రమే.
Read also:hindi.vaartha.com
Read also: