కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కాంగ్రెస్ కీలక భూమిక పోషించిందని, దేశ నిర్మాణంలో దారిచూపిన పార్టీగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
Read Also: TG: ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టిన ప్రభుత్వం: కల్వకుంట్ల కవిత

ప్రజాస్వామ్య విలువలు, పేదల సంక్షేమమే లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య ఆకాంక్షలను ప్రతిబింబించిందని సీఎం తెలిపారు. పేదల ఆకలి తీర్చడం, సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల్లో పార్టీకి(Congress party) ప్రత్యేక స్థానం ఉందన్నారు. 140 కోట్ల భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా కాంగ్రెస్ నిలిచిందని అభిప్రాయపడ్డారు.
కార్యకర్తల త్యాగాలతో రాసిన చరిత్ర
141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కార్యకర్తల కష్టానికి, త్యాగాలకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తల చెమట చుక్కలే పార్టీ చరిత్రను లిఖించిన అక్షరాలుగా మారాయని ట్వీట్‌లో భావవ్యక్తం చేశారు. రానున్న కాలంలో కూడా అదే ఆత్మవిశ్వాసంతో ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: