हिन्दी | Epaper

Coimbatore: నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన పులి..ఆచూకీ కోసం గాలింపు

Sharanya
Coimbatore: నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన పులి..ఆచూకీ కోసం గాలింపు

కోయంబత్తూరు (Coimbatore) జిల్లా వాల్పరై వద్ద చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన అందరి హృదయాలను కలిచివేస్తోంది. అడవిని ఆనుకుని ఉన్న టీ ఎస్టేట్ ప్రాంతాల్లో చిరుతపులుల బెడద ఉన్నప్పటికీ, ఇలా నడిరోడ్డుపై మనుషుల మధ్యకు వచ్చి ఓ నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన ఘటన స్థానికులను మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేసింది. నాలుగు సంవత్సరాల పసి ప్రాయపు బాలిక రోష్నిని చిరుత తమ నోటితో పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లిందన్న విషయం ఊహించడానికే భయంకరంగా ఉంది.

Coimbatore: నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన పులి..ఆచూకీ కోసం గాలింపు
Coimbatore: నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన పులి..ఆచూకీ కోసం గాలింపు

తల్లిదండ్రుల ఆవేదన:

తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పని చేసుకుంటున్నారు. తమ నాలుగేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఆడుకోమని చెప్పి అక్కడికి కొద్ది దూరంలోనే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో రాకాసి చిరుత పాపం ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా ఆ చిన్నారితో తన నోటితో కరుచుకొని అడవుల్లోకి లాక్కెళ్లింది. ఈ ఘటన వాల్పరైలో శుక్రవారం సాయంత్రం జరిగింది. నాలుగు సంవత్సరాల బాలికను చిరుతపులి లాక్కెళ్లిన ఘటన సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్‌లోని వాల్పరై పట్టణానికి సమీపంలోని పచ్చమలై ఎస్టేట్‌లోని సౌత్ డివిజన్‌లో చోటు చేసుకుంది. చిన్నారి రోష్ని, జార్ఖండ్‌కు చెందిన టీ ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కుండ్ కుమార్తె.

అటవీ అధికారులు, పోలీసుల గాలింపు:

పాపం బాలికకు ఏదైనా ఆనవాలు దొరికేలా గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు, పోలీసులంతా కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించలేదు. దీంతో రోష్ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టీ ఎస్టేట్‌లో పనిచేసేందుకు పాపం వారు గత ఆదివారమే పని కోసం జార్ఖండ్ నుండి వాల్పరైకి వచ్చారు. ఇంతలో తమ చిన్నారికి ఇలా జరిగింది. చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లిన పులి ఆమెను ఏం చేసి ఉంటుందో అని అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

Read also: Tanu: గొయ్యి తవ్వి కోడలిని పూడ్చి పెట్టి.. ఆపై లేచిపోయిందని ప్రచారం..

Air India: ప్రమాదం తర్వాత భారీగా ఎయిర్ ఇండియాకు తగ్గిన బుకింగ్‌లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870