हिन्दी | Epaper

Cigarette: సిగరెట్ ధరలు ఏయే బ్రాండ్ ఎంత పెరిగిందంటే..

Vanipushpa
Cigarette: సిగరెట్ ధరలు ఏయే బ్రాండ్ ఎంత పెరిగిందంటే..

మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? అయితే మీ జేబుకు గట్టి దెబ్బ తగిలే రోజు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో సిగరెట్ (Cigarette) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రభుత్వం ఈ స్థాయిలో పన్నులను సవరించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మార్పుల వల్ల సాధారణ సిగరెట్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్నింటి ధరలూ భారీగా పెరిగాయి. ధరలు ఎంత పెరిగాయి? కొత్త ఎక్సైజ్ డ్యూటీ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత.. ఒక్కో సిగరెట్ ప్యాకెట్ (10 స్టిక్స్) ధర కనిష్టంగా రూ. 20 నుంచి రూ. 25 వరకు పెరిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే! మీరు తాగే సిగరెట్ పొడవు (Length), బ్రాండ్‌ను బట్టి ఈ పెంపు రూ. 55 వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: Earthquake in Kashmir : కశ్మీర్ లో భూకంపం

Cigarette: సిగరెట్ ధరలు ఏయే బ్రాండ్ ఎంత పెరిగిందంటే..
Cigarette: సిగరెట్ ధరలు ఏయే బ్రాండ్ ఎంత పెరిగిందంటే..

సిగరెట్ ధరలు

ఇప్పటివరకు రూ. 95 కి లభించే విల్స్ నేవీ కట్ (76 mm) ప్యాకెట్ ఇకపై రూ. 120 కి చేరే అవకాశం ఉంది. అలాగే గోల్డ్ ఫ్లేక్ కింగ్స్, క్లాసిక్ మైల్డ్స్ వంటి 84 mm సిగరెట్ల ధర రూ. 170 నుంచి ఏకంగా రూ. 225 కి పెరిగేలా కనిపిస్తోంది. ప్రీమియం సెగ్మెంట్లో ఉండే స్లిమ్ సిగరెట్ (Cigarette) ప్యాకెట్ల ధర రూ. 300 నుంచి రూ. 350 వరకు పెరగనుంది. పన్నుల విధానంలో మార్పులు ఇవే.. ఇప్పటివరకు సిగరెట్లపై 28% GST తో పాటు కాంపెన్సేషన్ సెస్ ఉండేది. కానీ, ఫిబ్రవరి 2026 నుంచి ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. ఇప్పుడు అత్యధికంగా 40% GST తో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ, సెస్ కూడా వర్తిస్తాయి. అంతర్జాతీయ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని ప్రభుత్వం చెబుతోంది.

చిరు వ్యాపారుల ఆందోళన

స్టాకిస్టులు , చిరు వ్యాపారుల ఆందోళన ఈ ధరల పెరుగుదల కేవలం వినియోగదారులనే కాకుండా, వ్యాపారులను కూడా కలవరపెడుతోంది. కొత్త పన్ను విధానం వల్ల పాత స్టాక్ అయిపోయిన తర్వాత కొత్త MRP లతో కూడిన స్టాక్ మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మరోవైపు ధరలు పెరగడం వల్ల అక్రమ రవాణా (Smuggling) , నకిలీ సిగరెట్ల చలామణి పెరిగే అవకాశం ఉందని ‘ఆల్ ఇండియా సిగరెట్ అండ్ టొబాకో డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్’ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాధారణ చిరు వ్యాపారులు నకిలీ ఉత్పత్తుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870