సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా ధరలు పెరుగనున్నాయి. వాటిపై జీఎస్టీతోపాటు అదనపు సెస్ విధించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. (Cigarette and Beedi Costlier) పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్సు విధించనున్నట్లు పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై (Cigarette and Beedi Costlier)40 శాతం జీఎస్టీ విధిస్తారు. బీడీలపై 18 శాతం జీఎస్టీ ఉంటుంది. అలాగే పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం కూడా విధిస్తారు. పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు ఉంటుంది. గతంలో ఉన్న కంపన్‌సేషన్ సెస్సు స్థానంలో ఈ కొత్త సెస్సు అమలు చేస్తారు.
Read Also: http://Gold Price Rate : కొత్త ఏడాది షాక్ జనవరి 1న బంగారం, వెండి ధరలు తగ్గాయి

మరోవైపు చూయింగ్ టొబాకో, జర్దా సెంటెడ్ టొబాకో, గుట్కా ప్యాకింగ్ యంత్రాలు (సామర్థ్య నిర్ధారణ, సుంకం వసూలు) నియమాలను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడిచింది. దీంతో వాటి తయారీ మెషిన్స్‌పై కూడా అదనపు పన్నులు ఉంటాయి. అయితే పాన్ మసాలా తయారీపై కొత్తగా ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకుపై ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి అనుమతించే రెండు బిల్లులను డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: