పుణెలో విషాదం: ఐదేళ్ల బాలికపై చిరుత దాడి
పుణె జిల్లా పింపర్‌ఖేడ్ గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన స్థానికులను కలచివేసింది. తన తాతకు నీరు తీసుకెళ్తున్న ఐదేళ్ల బాలికపై చెరకు తోటలో దాక్కున్న చిరుతపులి (Chirutha attack) దాడి చేసింది. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
Read also: ఆర్జేడీకి ఇద్దరి ఎమ్మెల్యేలు రాజీనామా

దారుణ సంఘటన వివరాలు
పింపర్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్ దేవ్‌రామ్ బొంబే పొలంలో దున్నుతుండగా, అతని మనవరాలు శివన్య శైలేష్ బొంబే తాగునీరు తీసుకుని వెళ్తుండగా చెరకు తోటలో దాక్కున్న చిరుత దాడి చేసింది. తాత అరుణ్ దేవ్‌రామ్ ఆ దృశ్యాన్ని చూసి వెంటనే అరుస్తూ చిరుతను తరిమి తన మనవరాలిని రక్షించడానికి ప్రయత్నించాడు. వెంటనే బాలికను మంచార్ ఉప-జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆమె మరణించినట్లు ధృవీకరించారు.
ప్రజల్లో భయం, అధికారుల స్పందన
సంఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి దిలీప్‌రావ్ వాల్సే పాటిల్, మాజీ ఎంపీ శివాజీరావ్ అధల్‌రావ్ పాటిల్ ఆసుపత్రికి (hospital) చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గత కొన్ని నెలలుగా పింపర్‌ఖేడ్ పరిసర ప్రాంతాల్లో చిరుత (Chirutha attack) దాడులు పెరుగుతున్నాయి. ఇది ఏడో ఘటన కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. చిరుతను వెంటనే బోనులో బంధించాలని స్థానికులు అటవీ శాఖను డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: