हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Cab Charges: క్యాబ్ ఛార్జీల పెంపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Anusha
Cab Charges: క్యాబ్ ఛార్జీల పెంపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా ప్రయాణాల కోసం ఎక్కువగా వినియోగించబడే క్యాబ్ సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. డిమాండ్‌కు అనుగుణంగా క్యాబ్ రైడ్ ఛార్జీల్లో మార్పులకు అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో క్యాబ్ చార్జీ (Cab Charges) లు పెంచుకోవచ్చని, అలాగే రద్దీ తక్కువగా ఉండే సమయంలో ఛార్జీలు తగ్గించవచ్చని స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది.కొత్త నిబంధనల ప్రకారం ఆఫ్ పీక్, రద్దీ తక్కువగా ఉన్న సమయంలో బేస్ ఛార్జ్ కన్నా 50 శాతం తక్కువగా ఉండాలని, అలానే పీక్ అవర్స్‌లో ఈ మొత్తాన్ని 200 శాతం వరకు అనగా రెట్టింపు చేసుకునేందుకు అనుమతించింది.అలానే 3కిలో మీటర్ల లోపు దూరానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని తెలిపింది. అలానే రాపిడో, ఓలా, ఉబర్ వంటి రైడ్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రైవేట్ మోటార్ సైకిల్స్‌ను వినియోగించుకునేందుకు అనగా బైక్ ట్యాక్సీలకు కేంద్రం పచ్చ జెండా ఊపింది.

అదనపు ఛార్జీలు

కొత్త నిబంధనల ప్రకారం రైడ్ ఛార్జీలు పికప్ పాయింట్ నుంచి డ్రాప్ లోకేషన్ వరకు మాత్రమే వర్తించేలా ఉండాలి. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం సూచించింది. అలానే యాప్‌లో డ్రైవర్ రైడ్ అంగీకరించిన తర్వాత సరైన కారణం లేకుండా దాన్ని క్యాన్సిల్ చేస్తే, రైడ్ ఛార్జీలో సుమారు 10 శాతం పెనాల్టీ విధిస్తారు. ఇది గరిష్టంగా 100 రూపాయలు ఉండనుంది. ఈ మొత్తాన్ని రైడ్ ప్లాట్‌పామ్ (Ride Platform), డ్రైవర్ మధ్యన సమానంగా షేర్ చేస్తారు. అలానే సరైన కారణం లేకుండా రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ప్రయాణికుడికి కూడా ఇదే పెనాల్టీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

Cab Charges: క్యాబ్ ఛార్జీల పెంపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Cab Charges:

వివిధ వర్గాల వాహనాలకు సంబంధించి

డ్రైవర్ల సంక్షేమం కోసం కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. రైడింగ్ ప్లాట్‌ఫామ్ ఓనర్లు తమతో జాయిన్ అయిన ప్రతి డ్రైవర్‌కు కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని కచ్చితంగా అందించాలని సూచించింది. అలానే కొత్త నిబంధనల ప్రకారం, ఆటో రిక్షాలు, బైక్ టాక్సీ (Bike taxi) లు సహా వివిధ వర్గాల వాహనాలకు సంబంధించి బేస్ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ప్రస్తుతం ఇవి అధికారికంగా అగ్రిగేటర్ పాలసీ ఆయా యాప్స్ యాజమాన్యానం కింద ఉన్నాయి.

Read Also: Gold Rates Today: పెరుగుతున్న పసిడి ధరలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870