Kerala: కేరళ (Kerala) లోని త్రిసూర్ జిల్లా చోవూర్ బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం ఒక దారుణ ఘటన జరిగింది. వర్షం పడుతుండగా బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపైకి ఒక్కసారిగా ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో పరిస్థితి ఎలా ఉందంటే
త్రిసూర్ లోని చోవూర్ బస్టాండ్ లో ముగ్గురు మహిళలు బస్సు కోసం వేచి ఉన్నారు. వర్షం పడుతుండడంతో గొడుగులతో నిల్చున్నారు. ఇంతలో ఓ బస్సు అటుగా వస్తూ అదుపుతప్పింది. బస్టాప్ ముందు నిల్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. మహిళలు ప్రమాదాన్ని గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్ వైరల్:
ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లను కలచివేస్తున్నాయి.
డ్రైవర్ పరారీలో:
ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ఘటన అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలింపు ప్రారంభించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి స్తిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Chennai: మహిళా ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం
Tiger: సియోని జిల్లాలో ఇద్దరిని బలిగొన్న పులి ఎట్టకేలకు పట్టివేత