ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టినప్పటికీ.. నిరసనల మధ్యే బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొద్దిసేపు క్రితమే ప్రవేశపెట్టారు. గత పదేండ్లలో సాధించిన అభివృద్దే తమకు స్ఫూర్తి అని, మార్గదర్శి అన్నారు. గత పదేండ్లలో సాధించిన అభివృద్ధి సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపు సాధించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందన్నారు. ఈ సందర్భంగా దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించారు.

మహిళల పట్ల దృష్టి సారించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధించడం కోసం అందరిని కలుపుకుపోతున్నామని తెలిపారు. ఇంధన సరఫరాను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వ్యవసాయం, పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి సారించామని, వికసిత భారత్‌లో సమ్మిళిత వృద్ధి ప్రధానంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పథకాలతో అధునాతన వ్యవసాయ పద్ధతులను తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. నైపుణ్యాన్ని, టెక్నాలజీని పెంపొందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తున్నామన్నారు.