हिन्दी | Epaper

Black box : బ్లాక్‌ బాక్స్‌పై అన్వేషణ కొనసాగుతుంది : ఎయిర్ ఇండియా

Sudha
Black box : బ్లాక్‌ బాక్స్‌పై అన్వేషణ కొనసాగుతుంది : ఎయిర్ ఇండియా

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. దర్యాప్తులో ఎంతో కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ (Black box) గురించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించిన బ్లాక్‌ బాక్స్‌ ఇంకా లభించలేదని ఎయిర్‌ ఇండియా (Air India) సంస్థ స్పష్టం చేసింది.

Black box : బ్లాక్‌ బాక్స్‌ ఇంకా లభించలేదు : ఎయిర్ ఇండియా
Black box : బ్లాక్‌ బాక్స్‌ ఇంకా లభించలేదు : ఎయిర్ ఇండియా

లండన్‌ బయఅహ్మదాబాద్‌ నుంచి ల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు మొదలైంది. దర్యాప్తులో ఎంతో కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ (Black box) గురించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించిన బ్లాక్‌ బాక్స్‌ ఇంకా లభించలేదని ఎయిర్‌ ఇండియా (Air India) సంస్థ స్పష్టం చేసింది.
విమానం వెనుక భాగంలో
‘విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్‌ బాక్స్‌ ఇంకా లభించలేదు. దొరికినట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమే’ అని ఎయిర్‌ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్‌ బాక్స్‌ దొరికిందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై సంస్థ స్పష్టతనిచ్చింది. ఈ బ్లాక్‌ బాక్స్‌ దొరికితే ప్రమాదానికి గల కారణాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్లాక్‌ బాక్స్‌ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విమానం వెనుక భాగంలో ఇది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విమానం బిల్డింగ్‌ శిథిలాల్లో చిక్కుకుపోయింది. దీంతో బ్లాక్‌ బాక్స్‌ను తీయడం కష్టంగా మారింది.
మృత్యుంజయుడు
అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా (Air India) బోయింగ్‌ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్కరు రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ విమానం హాస్పిటల్‌ హాస్టల్‌ బిల్డింగ్‌పై కూలడంతో మరో 24 మంది మెడికోలు మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు.
బ్లాక్‌ బాక్స్‌ కీలకం
విమాన ప్రమాదాల్లో బ్లాక్‌ బాక్స్‌ కీలకం అన్న విషయం తెలిసిందే. ఇది ఆరెంజ్‌ కలర్‌లో ఉంటుంది. విమానం, హెలికాప్టర్ల ప్రమాదం జరిగేకంటే కనీసం రెండు గంటల ముందు ఏం జరిగిందన్న వివరాలను ఈ బ్లాక్‌బాక్స్‌ స్టోర్‌ చేసుకుంటుంది. విమానాలు క్రాష్‌ అయినా ఇందులోని సమాచారం తొలగిపోదు. ప్రమాదానికి గల కారణం, ప్రమాదానికి ముందు ఏం జరిగింది.. తదితర సమాచారం అంతా ఈ బ్లాక్‌ బాక్సులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. భవిష్యత్తు ప్రమాదాలను నిరోధించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Read Also:Ahmedabad: విమాన ప్రమాదం..కష్టంగా మారిన మృతదేహా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870