ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. తమిళనాడు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేతో పాటు తమిళగ వెట్రి కజగం.. (TVK) పూర్తి స్థాయి ఎన్నికల సంగ్రామానికి దిగబోతోంది. ఫలితంగా త్రిముఖ పోటీ నెలకొంది. టీవీకే తరఫున ప్రముఖ నటుడు దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని టీవీకే ఇదివరకే అధికారికంగా ప్రకటించింది కూడా. దీంతో ఈ ఎన్నికలను డీఎంకే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటోంది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగనుంది ఏఐఏడీఎంకే. సీట్ల సర్దుబాటు చర్చలు సాగుతున్నాయి ఈ రెండు పార్టీల మధ్య. మొన్నటికి మొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించడం.. అక్కడి రాజకీయాలను వేడెక్కించింది.
Read Also: Kerala: షింజిత ముస్తాఫా పై కేసు నమోదు

అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) ఘర్ వాపసీ
ఈ పరిణామాల మధ్య బీజేపీ(BJP)కి బిగ్ బ్రేక్ త్రూ లభించింది. గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వెళ్లిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) ఘర్ వాపసీ అయింది. ఈ విషయాన్ని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వెల్లడించారు. ఎన్డీఏలో చేరినట్లు ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే ఆయన కేంద్రమంత్రి పియూష్ గోయెల్ ను కలిశారు. ఎన్డీఏలోకి రీఎంట్రి ఇచ్చారు. అంంతకుముందు చెన్నైలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎంకేను ఓడించి రాష్ట్రంలో స్థిరమైన పాలనను అందించడమే తన ఉద్దేశమని, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఒకే జెండా కిందికి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్డీఏలోకి తిరిగి రావడాన్ని కొత్త ఆరంభంగా దినకరన్ అభివర్ణించారు. రాజకీయాల్లో రాజీ అనేది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. రాజీ పడటంలో తప్పులేదని, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ కూటమికి తనవంతు సహాయం అందిస్తానని ఉద్ఘాటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: