Bijapur encounter : మావోయిస్టు పార్టీకీ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు కీలక వ్యూహకర్తగా ఉన్న పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉంది. మాడ్వి హిడ్మా సహా పలువురు సీనియర్ నేతలు మృతి చెందిన తర్వాత దక్షిణ బస్తర్‌లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో పాపారావు ఒకడిగా కొనసాగుతున్నాడు.
Read Also: Health Department:త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
పాపారావు కదలికలపై నిఘా సమాచారం అందడంతో (Bijapur encounter) ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. తెల్లవారుజామున జరిగిన భీకర కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎన్‌కౌంటర్ స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
గతేడాది నవంబర్‌లో ఇదే ఇంద్రావతి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాపారావు తృటిలో తప్పించుకున్నాడు. అప్పట్లో అతని భార్య ఊర్మిళ సహా పలువురు నేతలు మృతి చెందారు. అయితే అప్పట్లో తప్పించుకున్న పాపారావు, ఇప్పుడు అదే అడవుల్లో భద్రతా దళాల చేతిలో హతమవడం గమనార్హంగా మారింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: