हिन्दी | Epaper

Bihar: పాతిక వేలకే పెళ్లికి అమ్మాయిలు దొరుకుతారు..మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Vanipushpa
Bihar: పాతిక వేలకే పెళ్లికి అమ్మాయిలు దొరుకుతారు..మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మంత్రి భర్త, బీజేపీ నేత బిహార్ అమ్మాయిలు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉత్తరాఖండ్(Uttarakhand) మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య భర్త గిరిధర్ లాల్ సాహు.. పెళ్లికోసం బీహార్‌లో అమ్మాయిలు రూ. 20,000-25,000లకే దొరుకుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్, బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తన వ్యాఖ్యలపై సాహు క్షమాపణ చెప్పినప్పటికీ.. బీజేపీ మాత్రం వివాదానికి దూరంగా ఉంది. అల్మోరాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సాహు అక్కడ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read Also: Atmakur: రూ.144.5 కోట్ల అభివృద్ధి పనులు: ఆనం రామనారాయణరెడ్డి

‘నాతో రండి, మీకు పెళ్లి చేస్తాం’

‘మీరు వృద్ధాప్యంలో పెళ్లి చేసుకుంటారా? అమ్మాయి దొరక్కుంటే మీ కోసం బీహార్ నుంచి ఒకరి తీసుకువస్తాం.. అక్కడ రూ.20,000 నుంచి రూ. 25,000లు ఇస్తే అమ్మాయిను పొందొచ్చు’ అని ఆయన మాట్లాడటం వీడియోలో ఉంది. ‘నాతో రండి, మీకు పెళ్లి చేస్తాం’ అని కూడా ఆయన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది. అయితే, తన మాటలను వక్రీకరించారని, కేవలం ఒక స్నేహితుడి పెళ్లి గురించి మాట్లాడానని వివాదం సాహు ఒక వీడియో విడుదల చేశారు. ‘నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే, చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.

Minister: బీహార్‌లో పాతిక వేలకే పెళ్లికి అమ్మాయిలు దొరుకుతారు
Minister: బీహార్‌లో పాతిక వేలకే పెళ్లికి అమ్మాయిలు దొరుకుతారు

అధికార బీజేపీ ఈ వ్యాఖ్యలను ఖండించింది. సాహుకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందిస్తూ.. దేశంలో మహిళలందరినీ అవమానించారని మండిపడింది. ‘మంత్రి ఆర్య భర్త చేసిన ఈ వ్యాఖ్యలు బిహార్, కేరళ, లేదా ఉత్తరాఖండ్‌లోనే కాదు దేశంలోని కుమార్తెలందరికీ అవమానం’ అని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గోడియల్ అన్నారు. మహిళల పట్ల బీజేపీ గౌరవాన్ని ఇవి స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆయన ఆరోపించారు ‘ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించి, క్షమాపణ చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

దేవుడే నన్ను రక్షించాడు: ఫరూక్ అబ్దుల్లా

దేవుడే నన్ను రక్షించాడు: ఫరూక్ అబ్దుల్లా

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు దుర్మరణం!
0:58

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు దుర్మరణం!

క్యాప్‌జెమినీ  సీఈవో తో లోకేష్ భేటీ

క్యాప్‌జెమినీ  సీఈవో తో లోకేష్ భేటీ

అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. భారత నావికుడి మృతి

అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. భారత నావికుడి మృతి

ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

తెలంగాణలో ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌’ పథకం సక్సెస్

తెలంగాణలో ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌’ పథకం సక్సెస్

వాహనం ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం!

వాహనం ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం!

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీం కోర్టులో కీలక విచారణ

పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీం కోర్టులో కీలక విచారణ

📢 For Advertisement Booking: 98481 12870