మరో రెండురోజుల్లో బీహార్ లో ఎన్నికలు(Bihar elections) జరగనున్నాయి. మొదటి విడతగా 6వతేదీన, రెండవ విడతగా 11వతేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ప్రధాన పార్టీలు గెలుపు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంతో పాటు పలు ఉచిత పధకాలను ప్రకటిస్తున్నారు. అంతటితో ఆగక ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, నగదు, బహుమతిగా వస్తువుల జోరు కొనసాగుతున్నది. ఎన్నికల నిఘా కన్నులను కప్పి, మరీ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం తనిఖీలు చేయడంతో మద్యం, థగదును స్వాధీనం చేసుకుంది. వీటి విలువ 108 కోట్లు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
Read also: ప్రియురాలి కోసం భార్యను చంపిన బెంగళూరు వైద్యుడు

చాటుమాటుగా పంపిణీలు
ఇప్పటికే మేనిఫేస్టోల పేరుతో ప్రధాన పార్టీలు చాటుమాటుగా గల్లీల్లో పంపిణీలు జరుగుతున్నాయి. బిహార్ తో సహా ఉప ఎన్నికలు జరిగే అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకూ 108 కోట్లు సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 9.62 కోట్ల నగదు, 42.15 కోట్ల విలువైన మద్యం, 5.8 కోట్ల ఆభరణాలు, 26 కోట్ల విలువైన ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు.
మద్యం నిషేధం ఉన్నప్పటికీ లిక్కర్ సరఫరా
పదేళ్లుగా బిహార్ లో(Bihar elections) మద్యపాన నిషేధం ఉన్నప్పటికీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి పొరుగురాష్ట్రాల నుంచి లిక్కర్ తరలిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ సారి మద్యం, నగదుతోపాటు మత్తుపదార్థాలను కూడా సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన డ్రగ్స్ విలువ 24.61 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. సి విజిల్ యాప్ ని ఉపయోగించి ఉల్లంఘనలపై ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇలా వచ్చిన ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈసీ. ఈనెల 6,11వ తేదీన రెండు విడతలుగా పోలింగ్ జరగనున్నది. 14వతేదీన ఫలితాలు వస్తాయి. ఎన్డీయే, ఇంగీ కూటముల మధ్య ప్రధాన పోటీగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: