Bengaluru bribe case : బెంగళూరులో అవినీతికి వ్యతిరేకంగా లోకాయుక్త పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు రూ.4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. చిట్ ఫండ్ మోసం, చీటింగ్ కేసుల్లో ఒక నిందితుడి పేరును తొలగించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు లోకాయుక్త అధికారులు వెల్లడించారు.
బిల్డర్ మొహమ్మద్ అక్బర్‌ను నిందితుల జాబితా నుంచి తప్పించేందుకు మొత్తం రూ.5 లక్షల డీల్ కుదిరిందని సమాచారం. ఇందులో (Bengaluru bribe case) భాగంగా జనవరి 24న ఇప్పటికే రూ.1 లక్ష తీసుకున్న గోవిందరాజు, మిగిలిన రూ.4 లక్షల కోసం సిరిసి సర్కిల్ సమీపంలోని సీఏఆర్ గ్రౌండ్‌కు యూనిఫాంలో, అధికారిక పోలీస్ జీపులో వచ్చాడు. ఇదే సమయంలో ముందుగా సమాచారం అందుకున్న లోకాయుక్త బృందం పక్కా ప్లాన్‌తో అక్కడే మోహరించింది.
Read Also: Airtel-Adobe Offer: ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ
బాధితుడు అక్బర్ ఫిర్యాదు మేరకు ఫినాల్ఫ్తలీన్ పౌడర్ పూసిన నోట్లను లోకాయుక్త అధికారులు అందించారు. గోవిందరాజు డబ్బు తీసుకున్న వెంటనే అధికారులు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఇదే కేసులో అతడు లంచాలు తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించగా, ఆడియో రికార్డింగ్‌లు సహా కీలక ఆధారాలు సమర్పించారు.
ప్రస్తుతం గోవిందరాజుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి ఈ విధంగా లంచం తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: