మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా ఉంటున్న థాకరే సోదరులు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే.. మరాఠీ భాష పరిరక్షణ కోసం ఒక్కటయ్యారు. ఇదే సమయంలో, వారి తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే(Bal Thackeray)కు చెందిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రలో హిందీ భాషపై ఉద్రిక్తత
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడాన్ని ‘విజయంగా’ అభివర్ణిస్తూ శనివారం ముంబైలో ఉద్ధవ్, రాజ్ కలిసి ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, రాబోయే ముంబై నగర పాలక సంస్థ (సివిక్ బాడీ) ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం హిందీని ప్రజలపై రుద్దడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
బాల్ థాకరే పాత వీడియో వైరల్
ఇదిలా ఉండగా, బాల్ థాకరే (Bal Thackeray) పాత వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో, “నేను మహారాష్ట్రలో మరాఠీ వాడిని కావచ్చు, కానీ భారతదేశంలో నేను హిందువును. మనం భాషా గుర్తింపుల కంటే హిందుత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలి” అని ఆయన మాట్లాడారు. తండ్రి సిద్ధాంతాలకు భిన్నంగా కొడుకులు భాషా రాజకీయాలు చేస్తున్నారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

ప్రభుత్వం చిక్కుల్లో – ఉత్తర్వులపై తిరుమార్గం
మహారాష్ట్రలో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ఏప్రిల్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వివాదం రాజుకుంది. మరాఠీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత ఉత్తర్వులను సవరించినా నిరసనలు ఆగలేదు. ఈ క్రమంలో రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (Navnirman Sena)కార్యకర్తలు మరాఠీ మాట్లాడలేదనే కారణంతో పలువురిపై దాడులకు పాల్పడటం హింసకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
మునుపటి మరియు తాజా పరిణామాలు
శివసేన రెండు ముక్కలయ్యాక, ఉద్ధవ్ తన రాజకీయ పునర్నిర్మాణం కోసం ప్రయత్నాలు. రాజ్ థాకరే (Bal Thackeray) మద్దతు కూడా అంతే కీలకం. మరాఠీ భాషపై అస్థిత్వ రాజకీయాలు మళ్లీ ప్రాధాన్యంలోకి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Prashant Kishor : విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ తాత్కాలిక బ్రేక్..