కేరళ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వయనాడ్ లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు (school) ఊహించని అతిథి వచ్చి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆశ్చర్యానికి గురిచేసింది. కెకాడిలోని ప్రభుత్వ ఎల్‌పీ పాఠశాల ఆవరణలోకి ఓ పిల్ల ఏనుగు (Baby elephant) ప్రవేశించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పాఠశాలలో వంద మందికిపైగా విద్యార్థులు ఉంటారు. స్కూల్ అడవికి సమీపంలో ఉండటంతో సాయంత్రం వేళల్లో తరచూ ఏనుగుల గుంపులు అటుగా వెళ్తుంటాయని సిబ్బంది తెలిపారు. అయితే, స్కూల్ టైమింగ్స్‌లో ఇలా లోపలికి రావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

పిల్ల ఏనుగు (Baby elephant)తమ స్కూల్ ఆవరణలోకి రావడంతో పిల్లలు ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు సెక్యూరిటీ కారణాలతో ఉపాధ్యాయులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. పిల్లల్ని తరగతి గదుల్లో ఉంచి తులుపులు వేశారు. దాదాపు గంటసేపు ఆ పిల్ల ఏనుగు (Baby elephant)పాఠశాల ఆవరణలో చక్కర్లు కొట్టినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చి పిల్ల ఏనుగును అడవిలోకి వదిలినట్లు చెప్పారు.
ఏనుగు పిల్ల వాస్తవాలు?
పిల్ల ఏనుగులు త్వరగా నేర్చుకుంటాయి. అవి పుట్టిన గంటలోనే నిలబడి కొన్ని రోజుల్లోనే నడుస్తాయి. పాలపై ఆధారపడి ఉన్నప్పటికీ వృక్షసంపద పట్ల ఆసక్తి కలిగి, నాలుగు నెలల వయసులో మొక్కలను రుచి చూడటం ప్రారంభిస్తాయి. వాటి సామాజిక ఆట – మాక్ ఛార్జింగ్, ట్రంక్ రెజ్లింగ్, బురద దొర్లడం – బలాన్ని మరియు సామాజిక బంధాలను పెంచుతాయి.
ఏనుగు పిల్ల తల్లిదండ్రులతో ఎంతకాలం ఉంటుంది?
ఏనుగులు తమ తల్లులతో ఎంతకాలం ఉంటాయి? సగటున, 16 సంవత్సరాలు — మానవ పిల్లలు తమ తల్లిదండ్రులపై ఆధారపడేంత సమయం.
తల్లి లేకుండా ఏనుగు పిల్ల బతుకుతుందా?
మగ ఏనుగులు కూడా 10-19 సంవత్సరాల వరకు మందతోనే ఉంటాయి, తరువాత అవి ఎక్కువగా ఒంటరి బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతాయి. అగ్ని, కరువు, మానవ-ఏనుగుల సంఘర్షణ లేదా సహజ కారణాల వల్ల తల్లులు చనిపోవడం వల్ల అనాథగా లేదా అడవిలో వదిలివేయబడిన పిల్ల ఏనుగు మనుగడ సాగించదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: