అయోధ్య రామమందిరంలో మంగళవారం ఉదయం 6:30 గంటలకు మరొకసారి పుణ్యమైన ఘట్టం ప్రారంభమైంది.ఈ పావన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అయోధ్యకు భక్తుల భారీగా తరలివచ్చారు, అధిక ఉష్ణోగ్రతలను సైతం లెక్కచేయకుండా రామ దర్బారు(Rama Darbar)లోని బాలరాముడి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ప్రధాన యాగాచార్యులు జై ప్రకాశ్ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ ‘శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాం. రామ్ లల్లా ఇప్పుడు రాజాధిరాజు రూపంలో దర్శనమిస్తారు’ అని పేర్కొన్నారు. మరో పండితుడు మాట్లాడుతూ ‘ప్రతి క్రతువు విజయవంతంగా సాగింది. రాముడి ఉనికి ఇప్పుడు ఒక రాజుగా మారుతోంది’ అన్నారు. అయోధ్య రామమందిరంలో బాలరాముడిపై ప్రతి శ్రీరామ నవమికి సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు.
ప్రతిష్ఠ కార్యక్రమాలు
బుధవారం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, తదుపరి వివిధ దేవతలకు పూజలు నిర్వహిస్తారని చెప్పారు.జూన్ 5 వరకు ప్రతిష్ఠ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అటు, సరయూ జయంతి వేడుకలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. జూన్ 5న మొదలయ్యే ఈ వేడుకల్లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) పాల్గొంటారు. హనుమాన్ ఆలయ ప్రధా మహంత్ రాజ్‌కుమార్ దాస్ మహారాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 5న అయోధ్యకు విచ్చేసి సరయూ జయంతి ఉత్సవంలో పాల్గొంటారని చెప్పారు.

రాముడిని దర్శించుకోవడం
అంజనేయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జూన్ 5 నుంచి 11వ తేదీ వరకు సాగుతాయి. ఇందులో భక్తి సంగీత కచేరీలు, పౌరాణిక ఉపన్యాసాలు, సాంప్రదాయ పూజలు జరుగుతాయి. సోమవారం రాత్రి ఆలయం వైభవంగా దీపాలతో, రంగుల కాంతులతో ప్రకాశించగా భక్తులు అనందంలో మునిగిపోయారు. ‘వేడిగా ఉంది. కానీ ఇక్కడ రాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. ఇది జీవితంలో మర్చిపోలేని ఘట్టం’ అని భక్తుడు ఒకరు అన్నారు. ఈ కార్యక్రమం కేవలం దైవానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక జీవన విధానానికి ప్రతీక. రాముడు ఇప్పటి నుంచి రాజసింహాసనం(Rajasimhasanam)పై కూర్చొని, భక్తులకు దర్శనమివ్వనున్నారు.గతేడాది గర్బగుడిలో జనవరి 22న బాలరాముడ్ని ప్రతిష్ఠించారు. దీంతో ఐదు శతాబ్దాల హిందువుల కల నెరవేరింది. వందేళ్లకుపైగా కోర్టులో సాగిన అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు వివాదానికి 2019 నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ముగింపు పడింది. ఫిబ్రవరి 2020లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటుచేసిన కేంద్రం ఆలయ నిర్మాణానికి అదే ఏడాది ఆగస్టులో శంకుస్థాపన నిర్వహించారు.
Read Also: Rishi Sunak: కన్నడలో నా భార్యకి ప్రపోజ్ చేశాను: బ్రిటిష్ మాజీ ప్రధాని