हिन्दी | Epaper

Atal Pension Yojana extension : అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్! 2031 వరకు కొనసాగింపు

Sai Kiran
Atal Pension Yojana extension : అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్! 2031 వరకు కొనసాగింపు

Atal Pension Yojana extension : అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్య భద్రత కల్పిస్తున్న Atal Pension Yojana (APY) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సంవత్సరాలు పొడిగించింది. Narendra Modi అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టే ప్రచార కార్యక్రమాలకు అవసరమైన నిధుల మద్దతును కూడా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

2015 మే 9న ప్రారంభమైన అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana extension) అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం అందించడమే లక్ష్యంగా రూపొందింది. ఈ పథకంలో చేరిన వారు చెల్లించే నెలవారీ చందాను బట్టి, 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు కనీస గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది. దేశంలో పెన్షన్ కవరేజ్‌ను విస్తరించడం, ఆర్థిక చేరికను బలోపేతం చేయడం, ‘వికసిత భారత్ @2047’ లక్ష్య సాధనకు ఈ పథకం కీలకంగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Read Also: Nellore: స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం

తాజా గణాంకాల ప్రకారం, 2026 జనవరి 19 నాటికి ఈ పథకంలో 8.66 కోట్లకు పైగా చందాదారులు చేరారు. అమలులో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం నమోదుల్లో 70.44 శాతం వాటా ప్రభుత్వ బ్యాంకులదే. అలాగే, గత ఆర్థిక సంవత్సరం (2023–24) ముగింపు నాటికి కొత్తగా చేరే వారి సంఖ్యలో 24 శాతం వృద్ధి నమోదవడం ఈ పథకానికి ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

📢 For Advertisement Booking: 98481 12870