హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదులను శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు.

ఉగ్రవాదులపై కఠిన చర్యలు అవసరం
ఒవైసీ పేర్కొన్నట్లు, “కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా లేకున్నా, పహల్గాం దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను శిక్షించాల్సిందే. పాకిస్తాన్ తన భూభాగాన్ని భారత్‌పై ఉగ్రదాడులకు ఉపయోగిస్తున్నంత వరకు శాంతి సాధ్యం కాదు” అని అన్నారు .
సైనికులకు మద్దతు
బయటి శక్తులు ఎప్పుడు భారత్ లోకి ప్రవేశించినా నేను భారత ప్రభుత్వానికి, ఆర్మీకి మద్దతుగా నిలుస్తూ వచ్చాను. ఇకపైనా మద్దతుగా ఉంటాను. యుద్ధ సమయంలో తెగువ చూపిన సైన్యానికి నా కృతజ్ఞతలు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుడు ఎం. మురళీ నాయక్, ఏడీడీసీ రాజ్ కుమార్ తపాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని ఓవైసీ అన్నారు.
ఈ సీజ్ ఫైర్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నా. గత రెండు వారాలుగా భారతీయులు, భారతీయ పార్టీలు ఒకటి గమనించాయని అనుకుంటున్నా. భారతీయులు ఐకమత్యంగా ఉంటే ఏం జరుగుతుందో చూపించాం. మనలోమనమే కొట్టుకుంటే శత్రువులకు చోటి ఇచ్చిన వాళ్లం అవుతాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. 1972లో జరిగిన షిమ్లా ఒప్పందం నుంచి చూస్తున్నాం మధ్యవర్తిత్వం ఎందుకు? కాశ్మీర్ మన అంతర్గత సమస్య అంతర్జాతీయ సమస్య కాదు. ఇతర దేశాల మాటలు ఎందుకు వినాలి ? భారత్- పాకిస్థాన్ మధ్య చర్చలు వేరే దేశంలో ఎందుకు జరగాలి ? పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించదని అమెరికా హామీ ఇస్తుందా ? అని ఓవైసీ ప్రశ్నించారు.
పాకిస్తాన్‌పై విమర్శలు
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఒవైసీ తీవ్రంగా విమర్శించారు. అలాగే, పాకిస్తాన్‌ను అణ్వాయుధాలు లేని దేశంగా మార్చేందుకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు . అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ బ్రోకర్ అని ఓవైసీ అన్నారు. పాకిస్థాన్ ను గ్రే లిస్ట్ లోకి పంపించేంత వరకూ భారత్ అంతర్జాతీయంగా పోరాడాలని ఓవైసీ సూచించారు. మరోవైపు పాకిస్థాన్ మరోసారి దొంగ దెబ్బ తీసింది. కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. అర్థరాత్రి జమ్మూలో మోటార్షెల్లింగ్, డ్రోన్లతో వరుసగా నాలుగోరోజూ దాడులకు పాల్పడింది. నగ్రోటా వద్ద భారత్ లోకి చొరబడేందుకు పాకిస్థాన్ యత్నం చేసింది. అయితే చొరబాటుదారులపై భారత ఆర్మీ కాల్పులు జరిపింది.
Read also: S Jaishankar : ఉగ్రవాదంపై భారత్ దృఢమైన, రాజీలేని వైఖరి : జైశంకర్