కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న సాంకేతిక విప్లవంగా నిలుస్తోంది. ఒకప్పుడు సినిమా లు, కథల్లో మాత్రమే చూసిన యంత్ర మేధస్సు నేడు మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. మొబైల్ ఫోన్లో వాయిస్ అసిస్టెంట్ నుంచి బ్యాంకింగ్, వైద్యం, విద్య, పరిశ్రమల వరకూ ఎఐ వినియోగం విస్తరిస్తోంది. అయితే ఈ వేగవంతమైన మార్పులతో పాటు సమాజంలో ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎఐ వల్ల ఉద్యో గాలు పోతాయా? లేక కొత్త ఉద్యోగాలు పుడతాయా? అనే సందేహం సామాన్యుల నుంచి నిపుణుల వరకూ అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎఐ ప్రవేశంతో కొన్ని ఉద్యోగాలు ప్రమాదంలో పడటం అనివార్యమనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. ముఖ్యంగా పునరావృతంగా జరిగే పనులు, నిర్దిష్ట విధానంలో చేయాల్సిన ఉద్యోగాలను ఎఐ (artificial intelligence)సులభంగా భర్తీ చేయగలుగుతోంది. ఉదాహరణకు డేటాఎంట్రీ, కాల్ సెంట ర్ లో సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఫ్యాక్ట రీల్లో యంత్రాల ఆపరేషన్, బ్యాంకుల్లో కొన్ని లావాదేవీలు వంటి పనులు ఇప్పటికే ఆటోమేషన్కు లోనవుతున్నాయి. ఒకప్పుడు వందల మంది చేసే పనిని ఇప్పుడు కొద్దిమంది పర్యవేక్షణతో యంత్రాలు చేస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు తగ్గుతున్నాయనే భావన సహజంగానే కలుగుతోంది. అయితే ఇది ఎఐ (artificial intelligence)కథలో ఒకే ఒక వైపు మాత్రమే. చరిత్రను పరి శీలిస్తే ప్రతి సాంకేతిక విప్లవం ప్రారంభంలో ఇలాంటి భయాలను రేకెత్తించింది. పరిశ్రమల విప్లవ కాలంలో యంత్రాలు వచ్చినప్పుడు కూడా మనుషులు పనులు పోతా యి అనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ కాలక్రమేణా కొత్త పరిశ్రమలు, కొత్త నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాలు పుట్టు కొచ్చాయి. అదే విధంగా ఎఐ కూడా కొన్ని ఉద్యోగాలను తగ్గించినా, అంతకన్నా ఎక్కువగా కొత్త అవకాశాలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉంది. ఎఐ వల్ల పుట్టుకొస్తున్న కొత్త ఉద్యోగాలను గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. డేటా సైంటిస్టులు, మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్లు, ఎఐ ట్రైనర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు వంటి ఉద్యోగాలు గత దశాబ్దం క్రితం పెద్దగా లేవు. నేడు ఇవి అత్యంత డిమాండ్ ఉన్న వృత్తులుగా మారాయి. అంతేకాదు, ఎఐ వ్యవస్థలను అభి వృద్ధి చేయడమే కాకుండా వాటిని పర్యవేక్షించడం, నైతి కంగా ఉపయోగిస్తున్నామా లేదా అన్నదాన్ని చూసే ఎఐ ఎథిక్స్ నిపుణుల అవసరం కూడా పెరుగుతోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మనం గమనించాలి.
Read Also: MTV: మూతపడిన ‘ఎంటీవీ’ మ్యూజిక్ ఛానెల్స్?

ఎఐ మనుషులను పూర్తిగా భర్తీ చేయడం కన్నా, మనుషులకు సహాయకుడిగా పనిచేసే అవకాశమే ఎక్కువ. వైద్య రంగాన్ని తీసుకుంటే, ఎఐ స్కాన్లు విశ్లేషించి వ్యాధులను త్వరగా గుర్తించడంలో సహాయపడుతోంది. కానీ తుది నిర్ణయం, రోగితో మానవీ యంగా మాట్లాడి చికిత్స ఇవ్వడం మాత్రం డాక్టరే. విద్య రంగంలో ఎఐ ఆధారిత లెర్నింగ్ ప్లాట్ఫారమ్లు విద్యార్థుల స్థాయిని అంచనా వేసి వ్యక్తిగతంగా పాఠాలు సూచిస్తున్నా యి. అయినా ఉపాధ్యాయుడి పాత్ర పూర్తిగా తగ్గిపోలేదు. మార్పు చెందింది, కానీ అవసరం తగ్గలేదు. భారతదేశం వంటి యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశానికి ఎఐ ఒక పెద్ద సవాల్తో పాటు గొప్ప అవకాశంగా కూడానిలుస్తోంది. సరైన నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమా దం ఉంటుంది. కానీ అదే సమయంలో కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ప్రపంచ స్థాయిలో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అందుకే ఇప్పుడు అవసరమైంది రిస్కిల్లింగ్, అప్సిల్లింగ్. అంటే ఉన్న ఉద్యోగాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చు కోవడం, మారుతున్న అవసరాలకు తగినట్లుగా మనల్ని మనం మార్చుకోవడం. ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమ లు ఈ విషయంలో కీలకపాత్ర పోషించాలి. పాఠశాలస్థాయి నుంచే డిజిటల్ లిటరసీ, కోడింగ్, సమస్య పరిష్కార నైపు ణ్యాలు నేర్పించాలి.
కళాశాలల్లో కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ స్కిల్స్పై దృష్టి పెట్టాలి. పరిశ్రమలు కూడా ఉద్యోగులకు నిరంతర శిక్షణ అందిస్తూ మార్పులకు సిద్ధం చేయాలి. అప్పుడే ఎఐ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి, లాభాన్ని పెంచుకోవచ్చు. ఎఐతో మరో కీలకమైన చర్చ నైతికతకు సంబంధించినది. యంత్రాలు తీసుకునే నిర్ణయాల్లో మానవ విలువలు, సమానత్వం, న్యాయం ప్రతిబింబిం చాలా? ఉద్యోగ నియామకాలు, లోన్లు, భద్రత వంటి విష యాల్లో ఎఐ తప్పులు చేస్తే బాధ్యత ఎవరిది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కూడా భవిష్యత్ ఉద్యో గాల్లో భాగం కానుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత కలిగిన ఆలోచన అవసరం అవుతుంది. ఎఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా నశించిపోతాయనే భయం అతిశయోక్తి. కొన్ని సంప్రదాయ ఉద్యోగాలు తగ్గినా, కొత్త రంగాలు, కొత్తవృత్తులు తప్పకుండా పుడతాయి. మార్పును అడ్డుకోవడం సాధ్యం కాదు, కానీ దానికి సిద్ధమవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. భయంతో వెనక్కి తగ్గడం కాకుండా, జ్ఞానంతో ముందుకు సాగితే ఎఐ మన శత్రువు కాదు మన సహచరుడిగా మారుతుంది. రేపటి ఉద్యోగ ప్రపంచంలో విజయం సాధించేది యంత్రాలతో పోటీ పడే వారు కాదు, యంత్రాలతో కలిసి పనిచేసే వారు అనే నిజాన్ని గ్రహించినప్పుడే భవిష్యత్ భద్రమవుతుంది.
-తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: