ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక పెట్టుబడికి మార్గం సుగమమైంది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్ (ArcelorMittal) మరియు నిప్పాన్ స్టీల్స్ (Nippon Steels) సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ కీలకమైన పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. ఈ ప్రక్రియ కేవలం 14 నెలల రికార్డ్ టైమ్‌లో సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
read also: Banglore: లైట్లు ఆఫ్ చేయమన్నందుకు.. డంబెల్‌తో హత్య చేసిన యువకుడు

ప్రాజెక్టు వివరాలు, లక్ష్యం
ఈ ఉక్కు పరిశ్రమను రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే,(ArcelorMittal) ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా స్థాపించబడే) ఫ్యాక్టరీగా నిలవనుంది. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ఇది ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమం ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ (CII) సదస్సు సందర్భంగా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన అనుమతి ప్రక్రియ కారణంగానే ఈ భారీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి సిద్ధమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: