हिन्दी | Epaper

Amit Shah: రాహుల్, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు

Aanusha
Amit Shah: రాహుల్, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు

అమెరికా తో ట్రేడ్ డీల్ అంశంపై రాజకీయ వాదోపవాదాలు ముదురుతున్నాయి.కేంద్రం రైతులకు, ద్రోహం చేస్తోందనిరాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. రైతుల గురించి పార్లమెంటులో రాహుల్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.

Read Also: Rajya Sabha MP controversy : రేణుకా చౌదరికి నోటీసులు, కారణం ఏమిటి?

Amit Shah: Rahul is misleading farmers
Amit Shah: Rahul is misleading farmers

పాడి రంగానికి పూర్తి రక్షణ

గత యూపీఏ ప్రభుత్వంతో పోలుస్తూ తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేసిన మేలును అమిత్ షా (Amit Shah) వివరించారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేవలం రూ. 26,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్, ప్రధాని మోదీ నాయకత్వంలో రూ. 1,29,000 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. గత దశాబ్ద కాలంలో కనీస మద్దతు ధరకు ఆహార ధాన్యాల సేకరణ పదిహేను రెట్లు పెరిగిందని తెలిపారు. “70 ఏళ్లుగా కాంగ్రెస్ రుణమాఫీ గురించి మాట్లాడిందే తప్ప చేసిందేమీ లేదు.

కానీ మా ప్రభుత్వం, రైతులు అప్పులపాలు కాకుండా ఉండేందుకు ఏటా రూ. 6,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది” అని ఆయన అన్నారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీయ పాడి రంగం దెబ్బతింటుందన్న విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టారు. ప్రభుత్వం పాడి ఉత్పత్తి రంగాన్ని బలహీనపరచలేదని, మరింత బలోపేతం చేసిందని స్పష్టం చేశారు. అన్ని ఒప్పందాలలోనూ పాడి రంగానికి పూర్తి రక్షణ కల్పించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు రావాలంటూ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఈ చర్చకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

సరోగసీ పై హైకోర్టు సంచలన తీర్పు!

సరోగసీ పై హైకోర్టు సంచలన తీర్పు!

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870