Amazon smartphone offers : టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ జనవరి 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, ఐకూ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.
బ్యాంక్ & ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ICICI బ్యాంక్ కార్డులతో 5% అదనపు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత తగ్గింపు పొందే అవకాశం ఉంది.
Read Also: NTR: ‘డ్రాగన్’ మూవీలో అనిల్ కపూర్
ఐఫోన్ 17 ప్రో & ప్రో మ్యాక్స్
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,400 నుంచి (Amazon smartphone offers) రూ.1,40,400కి తగ్గింది. ఇందులో A19 ప్రో చిప్, 48MP ట్రిపుల్ కెమెరా, 8K వీడియో రికార్డింగ్, 2TB స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,34,900 నుంచి రూ.1,25,400కి తగ్గింది.

శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా
ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ MRP రూ.1,29,999 కాగా, సేల్‌లో రూ.1,19,999కి లభిస్తోంది. 200MP AI కెమెరా, 6.9 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ ఇందులో ప్రధాన ఆకర్షణలు.
వన్‌ప్లస్ 15
MRP రూ.76,999 ఉన్న వన్‌ప్లస్ 15 ఇప్పుడు రూ.68,999కే లభిస్తోంది. 165Hz డిస్‌ప్లే, 7,300mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇది గేమింగ్ లవర్స్‌కు మంచి ఎంపిక.
ఒప్పో, వివో, ఐకూ ఫోన్లు
ఒప్పో ఫైండ్ X9 ప్రో రూ.98,999కి, వివో X300 5G రూ.75,999కి, ఐకూ 15 రూ.65,999కి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ హైఎండ్ కెమెరాలు, పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్నాయి.
మొత్తానికి, ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇది అద్భుత అవకాశం అని చెప్పొచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: